101. In God's sight there is no
near or distant, no present, past or future. These things are only a convenient
perspective for His world-picture.
101. భగవంతుడి దృష్టిలో దూరం దాపులు లేవు. భూత భవిష్యత్ వర్తమానాలు
ఉండవు. ఆతని విశ్వదృక్కులో ఇవన్నీ ఒక వీలైన దృక్పథం మాత్రమే.
102. To the senses it is always
true that the sun moves round the earth; this is false to the reason. To the
reason it is always true that the earth moves round the sun; this is false to
the supreme vision. Neither earth moves nor sun; there is only a change in the
relation of sun-consciousness & earth-consciousness.
102. స్థూల దృష్టిలో సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు
అన్నది నిజం. కాని వివేచన దృష్ట్యా అది నిజం కాదు. వివేచన ప్రకారం సూర్యుడి చుట్టూ
భూమి తిరుగుతోంది. కాని పరమచక్షువుకి అది కూడా నిజం కాదు. నిజానికి భూమి, సూర్యుడు
ఇద్దరూ కదలరు. జరిగేది కేవలం సూర్య చైతన్యానికి, పృథ్వీ చైతన్యానికి మధ్య పసర్పర సంబంధంలో
మార్పు మాత్రమే.
103. Vivekananda, exalting
Sannyasa, has said that in all Indian history there is only one Janaka. Not so,
for Janaka is not the name of a single individual, but a dynasty of self-ruling
kings and the triumph-cry of an ideal.
103. సన్యాస ధర్మాన్ని ప్రశంసిస్తూ వివేకానందుడు ఒకసారి ‘చరిత్రలో
జనకుడు ఒక్కడే వున్నాడు’ అన్నాడు. కాని అది సరి కాదు. జనకుడనేది ఒక వ్యక్తి పేరు కాదు.
అది ఆత్మసామ్రాజ్యాలనేలిన ఎందరో చక్రవర్తుల వంశనామం, ఒక మహాశయపు గెలుపును తెలిపే జయజయధ్వానం.
104. In all the lakhs of ochre-clad Sannyasins, how
many are perfect? It is the few attainments and the many approximations that
justify an ideal.
104. కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసులు లక్షల కొద్దీ వున్నా
వారిలో ఎందరు పరిపూర్ణులు అయ్యారు? ఆ కొద్దిపాటి విజయాలు, ఎన్నో ఉజ్జాయింపులే ఆశయానికి
బలాన్నిస్తాయి.
105. There have been hundreds of
perfect Sannyasins, because Sannyasa had been widely preached and numerously
practised; let it be the same with the ideal freedom and we shall have
hundreds of Janakas.
105. సన్యాస ధర్మం విస్తృతంగా బోధింపబడి, అమితంగా అభ్యసింప
బడినందునే ఎందరో సన్యాస మార్గాన్ని చేపట్టి కృతార్థులు అయ్యారు. నిజమైన స్వేచ్ఛ విషయంలో
కూడా అలాగే జరగనీ. వేలకొద్దీ జనకులు తప్పక పుట్టుకు వస్తారు.
106. Sannyasa has a formal garb
and outer tokens; therefore men think they can easily recognise it;
but the freedom of a Janaka does not proclaim itself and it wears the garb of
the
world; to its presence even Narada was blinded.
106. సన్యాసానికి
గుర్తుగా ప్రత్యేక వస్త్రధారణ మొదలైన బాహ్య చిహ్నాలున్నాయి. కాని జనకుడి విముక్త స్థితి
అంత సులభంగా ప్రకటం కాక ప్రాపంచిక ముసుగు వెనుక దాగి వుంటుంది. నారద ముని అంతటి వాడే
దాన్ని గుర్తించలేకపోయాడు.
107. Hard is it to be in the
world, free, yet living the life of ordinary men; but because it is hard,
therefore it must be attempted and accomplished.
107. ఈ ప్రపంచంలో ఉంటూ సామాన్యిడిలా జీవిస్తూ, ఆంతరిక స్వేచ్ఛ
కలిగి ఉండడం బహు కష్టం. కాని కష్టం కనుకనే దాన్ని తలపెట్టి ప్రయత్నం చేత సాధించాలి.
108. When he watched the actions
of Janaka, even Narada the divine sage thought him a luxurious worldling and
libertine. Unless thou canst see the soul, how shalt thou say that a man is free
or bound?
108. జనకుడి చేష్టలను గమనించిన నారదముని ఆయన భోగలాలసుడని,
విషయలోలుడని జమకట్టాడు. అంతరంగాన్ని తెలుసుకోకుండా వ్యక్తి బద్ధుడో, విముక్తుడో చెప్పడం
ఎలా సాధ్యం?
109. All things seem hard to man
that are above his attained level, & they are hard to his unaided effort;
but they become at once easy & simple when God in man takes up the
contract.
109. మనిషి యొక్క స్వతస్సిద్ధమైన శక్తిని మించిన కార్యాలన్నీ
దుస్సాధ్యంగా తోచుతాయి. అన్యసహాయం లేకుంటే అసాధ్యం అనిపిస్తాయి. కాని మనిషిలోనున్న
స్వామి రంగంలోకి దిగితే చిటికెలో అన్నీ సులభం అవుతాయి.
110. To see the composition of
the sun or the lines of Mars is doubtless a great achievement; but when thou
hast the instrument that can show thee a man's soul as thou seest a picture,
then thou wilt smile at the
wonders of physical Science as the playthings of babies.
110. సూర్యుడిలోని
అంశాలని, అంగారకుడి లోని రేఖలని దర్శించగలగడం గొప్ప విషయమే. కాని ఒక చిత్రాన్ని చూసినట్టు
మనిషిలోని ఆత్మని చూపే పరికరమే ఉన్నట్లయితే భౌతిక శాస్త్రపు అద్భుతాలన్నీ పిల్లల ఆటవస్తువులుగా
గోచరిస్తాయి.