Sri Aurobindo and the Mother

Sri Aurobindo and the Mother

Sunday, April 20, 2014

సూక్తులు- సుభాషితాలు (111-120)

111. Knowledge is a child with its achievements; for when it has found out something, it runs about the streets whooping and shouting; Wisdom conceals hers for a long time in a thoughtful
and mighty silence.

111. జ్ఞానం చిన్న పిల్లవాడి వంటిది. తనకొక విషయం తెలియగానే పసివాడిలా కేరింతలు కొడుతూ, కేకలు పెడుతూ ఊరంతా చాటుతుంది; వివేకం  తానెఱిగిన దాన్ని ప్రగాఢ, భావగర్భమైన నిశ్శబ్దంలో దీర్ఘకాలం దాచి ఉంచుతుంది.

112. Science talks and behaves as if it had conquered all knowledge: Wisdom, as she walks, hears her solitary tread echoing on the margin of immeasurable Oceans.
112. జ్ఞానసర్వస్వాన్నీ జయించినట్టు ప్రవర్తిస్తుంది విజ్ఞాన శాస్త్రం. వివేకం నిశ్శబ్దంగా నడుస్తుంటే దాని అడుగుల సవ్వడి అనంత సాగరాల అంచున ప్రతిధ్వనిస్తుంది.

113. Hatred is the sign of a secret attraction that is eager to free from itself and furious to deny its own existence. That too is God's play in His creature.
113. ద్వేషం అంటే తన నుండి తాని పారిపోవాలని చూస్తూ, తన ఉన్కినే తాను బలంగా తిరస్కరింప జూసే ఒక గుప్తమైన ఆకర్షణే. అది కూడా భగవంతుడు తన జీవులతో ఆడే ఆటే.

114. Selfishness is the only sin, meanness the only vice, hatred the only criminality. All else can easily be turned into good, but these are obstinate resisters of deity.
114.  ఉన్నది ఒకే ఒక పాపం, అది స్వార్థపరత; ఉన్నది ఒకే ఒక దుర్గుణం, అది కుటిల స్వభావం; ఉన్నది ఒకే ఒక పాతకం, అది ద్వేషం. ఇక తక్కిన గుణాలన్నిటిని మంచిగా మార్చేయొచ్చు. ఇవి మాత్రమే దివ్యత్వాన్ని మొండిగా నిరాకరిస్తాయి.

115. The world is a long recurring decimal with Brahman for its integer. The period seems to begin and end, but the fraction is eternal; it will never have an end and never had any real
beginning.
115. ప్రపంచం ఓ సుదీర్ఘ అనవధిక దశాంశ భిన్నం.  బ్రహ్మం అందులోని పూర్ణాంకం. దశాంశ బిందువుకి మొదలు, తుది వున్నట్లు ఉండొచ్చు. కాని భిన్నాంశం మాత్రం శాశ్వతం. దానికి ఎన్నటికీ అంతం వుండదు. ఎప్పటికీ ఆరంభం వుండదు.

116. The beginning and end of things is a conventional term of our experience; in their true existence these terms have no reality, there is no end and no beginning.
116. విషయాల యొక్క ఆద్యంతాలనేవి మన అనుభవానికి అలవాటైన పరిభాష మాత్రమే. నిజావస్థలో ఈ పదాలకి వాస్తవికతే లేదు. ఆద్యంతాలనేవి అసలు లేనే లేవు.

117. Neither is it that I was not before nor thou nor these kings nor that all we shall not be hereafter. Not only Brahman, but beings & things in Brahman are eternal; their creation
and destruction is a play of hide and seek with our outward consciousness.

117. “నీవు, నేను, ఈ రాజులు మునుపు లేరని కాదు, భావిలోను  ఉండక పోరు.” బ్రహ్మమొక్కటే కాదు, బ్రహ్మంలోని వస్తు, జీవన సముదాయం అంతా సనాతనమే. వాటి సృష్టి, లయ ఘట్టాలన్నీ మన బాహ్య చేతస్సులో జరిగే దోబూచులాటలే.

118. The love of solitude is a sign of the disposition towards knowledge; but knowledge itself is only achieved when we have a settled perception of solitude in the crowd, in the battle and
in the mart.
118. ఏకాంతం పట్ల  మక్కువ మనిషిలో జ్ఞానపిపాస యొక్క ఉన్కిని సూచిస్తుంది. కాని జనసందోహంలోను, యుద్ధభూమిలోను, విపణివీధిలోను కూడా చిత్తంలో ఏకాంతతా భావం స్థిరంగా నిలిచినప్పుడు జ్ఞాన సిద్ధి కలిగినట్లు.


119. If when thou art doing great actions and moving giant results, thou canst perceive that thou art doing nothing, then know that God has removed His seal from thy eyelids.
119. మీరు గొప్ప గొప్ప పనులు చేస్తూ, మహత్కార్యాలను సాధిస్తున్న తరుణంలో కూడా మీరు చేస్తున్నదేమీ లేదని గుర్తించగలిగితే భగవంతుడు మీ కంటి తెరలని తొలగించాడన్నమాట.

120. If when thou sittest alone, still & voiceless on the mountaintop, thou canst perceive the revolutions thou art conducting, then hast thou the divine vision and art freed from appearances.

120. ఎక్కడో పర్వతాగ్రాన నిశ్చలంగా, నిశ్శబ్దంగా కూర్చున్న స్థితిలో కూడా మీ మూలంగా లోకంలో సంభవించే విప్లవాలను దర్శించగలిగితే, మీలో దివ్యనేత్రం తెరుచుకున్నదన్నమాట.  పైపై దృశ్యాలు మిమ్మల్నిక మోసపుచ్చలేవు.