Sri Aurobindo and the Mother

Sri Aurobindo and the Mother

Sunday, April 20, 2014

సూక్తులు- సుభాషితాలు (111-120)

111. Knowledge is a child with its achievements; for when it has found out something, it runs about the streets whooping and shouting; Wisdom conceals hers for a long time in a thoughtful
and mighty silence.

111. జ్ఞానం చిన్న పిల్లవాడి వంటిది. తనకొక విషయం తెలియగానే పసివాడిలా కేరింతలు కొడుతూ, కేకలు పెడుతూ ఊరంతా చాటుతుంది; వివేకం  తానెఱిగిన దాన్ని ప్రగాఢ, భావగర్భమైన నిశ్శబ్దంలో దీర్ఘకాలం దాచి ఉంచుతుంది.

112. Science talks and behaves as if it had conquered all knowledge: Wisdom, as she walks, hears her solitary tread echoing on the margin of immeasurable Oceans.
112. జ్ఞానసర్వస్వాన్నీ జయించినట్టు ప్రవర్తిస్తుంది విజ్ఞాన శాస్త్రం. వివేకం నిశ్శబ్దంగా నడుస్తుంటే దాని అడుగుల సవ్వడి అనంత సాగరాల అంచున ప్రతిధ్వనిస్తుంది.

113. Hatred is the sign of a secret attraction that is eager to free from itself and furious to deny its own existence. That too is God's play in His creature.
113. ద్వేషం అంటే తన నుండి తాని పారిపోవాలని చూస్తూ, తన ఉన్కినే తాను బలంగా తిరస్కరింప జూసే ఒక గుప్తమైన ఆకర్షణే. అది కూడా భగవంతుడు తన జీవులతో ఆడే ఆటే.

114. Selfishness is the only sin, meanness the only vice, hatred the only criminality. All else can easily be turned into good, but these are obstinate resisters of deity.
114.  ఉన్నది ఒకే ఒక పాపం, అది స్వార్థపరత; ఉన్నది ఒకే ఒక దుర్గుణం, అది కుటిల స్వభావం; ఉన్నది ఒకే ఒక పాతకం, అది ద్వేషం. ఇక తక్కిన గుణాలన్నిటిని మంచిగా మార్చేయొచ్చు. ఇవి మాత్రమే దివ్యత్వాన్ని మొండిగా నిరాకరిస్తాయి.

115. The world is a long recurring decimal with Brahman for its integer. The period seems to begin and end, but the fraction is eternal; it will never have an end and never had any real
beginning.
115. ప్రపంచం ఓ సుదీర్ఘ అనవధిక దశాంశ భిన్నం.  బ్రహ్మం అందులోని పూర్ణాంకం. దశాంశ బిందువుకి మొదలు, తుది వున్నట్లు ఉండొచ్చు. కాని భిన్నాంశం మాత్రం శాశ్వతం. దానికి ఎన్నటికీ అంతం వుండదు. ఎప్పటికీ ఆరంభం వుండదు.

116. The beginning and end of things is a conventional term of our experience; in their true existence these terms have no reality, there is no end and no beginning.
116. విషయాల యొక్క ఆద్యంతాలనేవి మన అనుభవానికి అలవాటైన పరిభాష మాత్రమే. నిజావస్థలో ఈ పదాలకి వాస్తవికతే లేదు. ఆద్యంతాలనేవి అసలు లేనే లేవు.

117. Neither is it that I was not before nor thou nor these kings nor that all we shall not be hereafter. Not only Brahman, but beings & things in Brahman are eternal; their creation
and destruction is a play of hide and seek with our outward consciousness.

117. “నీవు, నేను, ఈ రాజులు మునుపు లేరని కాదు, భావిలోను  ఉండక పోరు.” బ్రహ్మమొక్కటే కాదు, బ్రహ్మంలోని వస్తు, జీవన సముదాయం అంతా సనాతనమే. వాటి సృష్టి, లయ ఘట్టాలన్నీ మన బాహ్య చేతస్సులో జరిగే దోబూచులాటలే.

118. The love of solitude is a sign of the disposition towards knowledge; but knowledge itself is only achieved when we have a settled perception of solitude in the crowd, in the battle and
in the mart.
118. ఏకాంతం పట్ల  మక్కువ మనిషిలో జ్ఞానపిపాస యొక్క ఉన్కిని సూచిస్తుంది. కాని జనసందోహంలోను, యుద్ధభూమిలోను, విపణివీధిలోను కూడా చిత్తంలో ఏకాంతతా భావం స్థిరంగా నిలిచినప్పుడు జ్ఞాన సిద్ధి కలిగినట్లు.


119. If when thou art doing great actions and moving giant results, thou canst perceive that thou art doing nothing, then know that God has removed His seal from thy eyelids.
119. మీరు గొప్ప గొప్ప పనులు చేస్తూ, మహత్కార్యాలను సాధిస్తున్న తరుణంలో కూడా మీరు చేస్తున్నదేమీ లేదని గుర్తించగలిగితే భగవంతుడు మీ కంటి తెరలని తొలగించాడన్నమాట.

120. If when thou sittest alone, still & voiceless on the mountaintop, thou canst perceive the revolutions thou art conducting, then hast thou the divine vision and art freed from appearances.

120. ఎక్కడో పర్వతాగ్రాన నిశ్చలంగా, నిశ్శబ్దంగా కూర్చున్న స్థితిలో కూడా మీ మూలంగా లోకంలో సంభవించే విప్లవాలను దర్శించగలిగితే, మీలో దివ్యనేత్రం తెరుచుకున్నదన్నమాట.  పైపై దృశ్యాలు మిమ్మల్నిక మోసపుచ్చలేవు.

Monday, March 31, 2014

సూక్తులు-సుభాషితాలు (101-110)

101. In God's sight there is no near or distant, no present, past or future. These things are only a convenient perspective for His world-picture.

101. భగవంతుడి దృష్టిలో దూరం దాపులు లేవు. భూత భవిష్యత్ వర్తమానాలు ఉండవు. ఆతని విశ్వదృక్కులో ఇవన్నీ ఒక వీలైన దృక్పథం మాత్రమే.
102. To the senses it is always true that the sun moves round the earth; this is false to the reason. To the reason it is always true that the earth moves round the sun; this is false to the supreme vision. Neither earth moves nor sun; there is only a change in the relation of sun-consciousness & earth-consciousness.

102. స్థూల దృష్టిలో సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అన్నది నిజం. కాని వివేచన దృష్ట్యా అది నిజం కాదు. వివేచన ప్రకారం సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోంది. కాని పరమచక్షువుకి అది కూడా నిజం కాదు. నిజానికి భూమి, సూర్యుడు ఇద్దరూ కదలరు. జరిగేది కేవలం సూర్య చైతన్యానికి, పృథ్వీ చైతన్యానికి మధ్య పసర్పర సంబంధంలో మార్పు మాత్రమే.

103. Vivekananda, exalting Sannyasa, has said that in all Indian history there is only one Janaka. Not so, for Janaka is not the name of a single individual, but a dynasty of self-ruling kings and the triumph-cry of an ideal.

103. సన్యాస ధర్మాన్ని ప్రశంసిస్తూ వివేకానందుడు ఒకసారి ‘చరిత్రలో జనకుడు ఒక్కడే వున్నాడు’ అన్నాడు. కాని అది సరి కాదు. జనకుడనేది ఒక వ్యక్తి పేరు కాదు. అది ఆత్మసామ్రాజ్యాలనేలిన ఎందరో చక్రవర్తుల వంశనామం, ఒక మహాశయపు గెలుపును తెలిపే జయజయధ్వానం.

104.  In all the lakhs of ochre-clad Sannyasins, how many are perfect? It is the few attainments and the many approximations that justify an ideal.

104. కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసులు లక్షల కొద్దీ వున్నా వారిలో ఎందరు పరిపూర్ణులు అయ్యారు? ఆ కొద్దిపాటి విజయాలు, ఎన్నో ఉజ్జాయింపులే ఆశయానికి బలాన్నిస్తాయి.

105. There have been hundreds of perfect Sannyasins, because Sannyasa had been widely preached and numerously practised; let it be the same with the ideal freedom and we shall have
hundreds of Janakas.
105. సన్యాస ధర్మం విస్తృతంగా బోధింపబడి, అమితంగా అభ్యసింప బడినందునే ఎందరో సన్యాస మార్గాన్ని చేపట్టి కృతార్థులు అయ్యారు. నిజమైన స్వేచ్ఛ విషయంలో కూడా అలాగే జరగనీ. వేలకొద్దీ జనకులు తప్పక పుట్టుకు వస్తారు.

106. Sannyasa has a formal garb and outer tokens; therefore men think they can easily  recognise it; but the freedom of a Janaka does not proclaim itself and it wears the garb of the
world; to its presence even Narada was blinded.

106.  సన్యాసానికి గుర్తుగా ప్రత్యేక వస్త్రధారణ మొదలైన బాహ్య చిహ్నాలున్నాయి. కాని జనకుడి విముక్త స్థితి అంత సులభంగా ప్రకటం కాక ప్రాపంచిక ముసుగు వెనుక దాగి వుంటుంది. నారద ముని అంతటి వాడే దాన్ని గుర్తించలేకపోయాడు.

107. Hard is it to be in the world, free, yet living the life of ordinary men; but because it is hard, therefore it must be attempted and accomplished.

107. ఈ ప్రపంచంలో ఉంటూ సామాన్యిడిలా జీవిస్తూ, ఆంతరిక స్వేచ్ఛ కలిగి ఉండడం బహు కష్టం. కాని కష్టం కనుకనే దాన్ని తలపెట్టి ప్రయత్నం చేత సాధించాలి.

108. When he watched the actions of Janaka, even Narada the divine sage thought him a luxurious worldling and libertine. Unless thou canst see the soul, how shalt thou say that a man is free or bound?

108. జనకుడి చేష్టలను గమనించిన నారదముని ఆయన భోగలాలసుడని, విషయలోలుడని జమకట్టాడు. అంతరంగాన్ని తెలుసుకోకుండా వ్యక్తి బద్ధుడో, విముక్తుడో చెప్పడం ఎలా సాధ్యం?

109. All things seem hard to man that are above his attained level, & they are hard to his unaided effort; but they become at once easy & simple when God in man takes up the contract.

109. మనిషి యొక్క స్వతస్సిద్ధమైన శక్తిని మించిన కార్యాలన్నీ దుస్సాధ్యంగా తోచుతాయి. అన్యసహాయం లేకుంటే అసాధ్యం అనిపిస్తాయి. కాని మనిషిలోనున్న స్వామి రంగంలోకి దిగితే చిటికెలో అన్నీ సులభం అవుతాయి.

110. To see the composition of the sun or the lines of Mars is doubtless a great achievement; but when thou hast the instrument that can show thee a man's soul as thou seest a picture,
then thou wilt smile at the wonders of physical Science as the playthings of babies.


110.  సూర్యుడిలోని అంశాలని, అంగారకుడి  లోని రేఖలని దర్శించగలగడం గొప్ప విషయమే. కాని ఒక చిత్రాన్ని చూసినట్టు మనిషిలోని ఆత్మని చూపే పరికరమే ఉన్నట్లయితే భౌతిక శాస్త్రపు అద్భుతాలన్నీ పిల్లల ఆటవస్తువులుగా గోచరిస్తాయి.

Wednesday, February 19, 2014

సూక్తులు - సుభాషితాలు (91-100)



91. If Life alone were & not death, there could be no immortality; if love were alone&not cruelty, joy would be only a tepid & ephemeral rapture; if reason were alone & not ignorance, our highest attainment would not exceed a limited rationality & worldly wisdom.

91. జీవనమే ఉండి మృత్యువే లేకుంటే అమరత్వమే ఉండేది కాదు. ప్రేమే ఉండి క్రూరత్వం లేకుంటే ఆనందం కేవలమొక పేలవమైన, క్షణికమైన హాయి మాత్రమే అయ్యేది. వివేచనా శక్తి మాత్రమే ఉండి అజ్ఞానం లేకుంటే, కొంత పరిమితమైన విచక్షణా జ్ఞానం, లౌకిక ప్రతిభ – ఇవే మనకు దక్కే పరమ ఫలితాలు అవుతాయి.


92. Death transformed becomes Life that is Immortality; Cruelty transfigured becomes Love that is intolerable ecstasy; Ignorance transmuted becomes Light that leaps beyond wisdom and
knowledge.

92.  పరివర్తన చెందిన మృత్యువే అమరమైన జీవనం అవుతుంది. రూపాంతరం చెందిన క్రౌర్యమే ప్రేమ అవుతుంది, ఓపలేని పారవశ్యమవుతుంది; మార్పునొందిన అజ్ఞానమే వివేచనని, జ్ఞానాన్ని అధిగమించే తేజం అవుతుంది.


93. Pain is the touch of our Mother teaching us how to bear and grow in rapture. She has three stages of her schooling, endurance first, next equality of soul, last ecstasy.

93. ఓరిమి చేత ఆనందం ఎలా పెరుగుతుందో ఆ లోకమాత నేర్పే పాఠమే బాధ. ఆమె నేర్పే విద్యలో మూడు దశలు ఉన్నాయి – ముందు ఓర్చుకోవడం, ఆ తరువాత సమత, చివరిగా ఆనంద పారవశ్యం.


94. All renunciation is for a greater joy yet ungrasped. Some renounce for the joy of duty done, some for the joy of peace, some for the joy of God and some for the joy of self-torture, but renounce rather as a passage to the freedom and untroubled rapture beyond.

94. ఇంతవరకు పొందని ఆనందాన్ని పొందడం కోసమే త్యాగం. కొందరు కర్తవ్యనిర్వహణలోని ఆనందం కోసం త్యాగం చేస్తారు. కొందరు ప్రశాంతత లోని ఆనందం కోసం, కొందరు భగవదానందం కోసం, మరి కొందరు ఆత్మహింసలోని ఆనందం కోసం త్యాగాలు చేస్తారు. కాని త్యాగాన్ని స్వేచ్ఛను సాధించే మార్గంగా గుర్తించి అక్షోభమైన పరమానందం కోసమే త్యాగం చెయ్యాలి.


95. Only by perfect renunciation of desire or by perfect satisfaction of desire can the utter embrace of God be experienced; for in both ways the essential precondition is effected,- desire perishes.

95.  కోర్కెను పూర్తిగా త్యజించినపుడైనా, లేదా కోర్కెను పూర్తిగా నెరవేర్చుకున్నపుడైనా భగవంతుడి పరమపరిష్వంగం అనుభవమవుతుంది. ఎందుకంటే ఈ రెండు మార్గాలలోనూ అవశ్యమైనది ముందుగా జరిగిపోతోంది – కోర్కె నశించిపోతోంది.


96. Experience in thy soul the truth of the Scripture; afterwards, if thou wilt, reason & state thy experience intellectually & even then distrust thy statement; but distrust never thy experience.

96.  శాస్త్రవాక్యాన్ని మీ ఆత్మలోనే అనుభవించండి. ఆ తరువాత కావాలంటే మీ అనుభవాన్ని మనసుకి తెలిసేలా నిర్వచించండి. ఇంకా అవసరమైతే ఆ నిర్వచనాన్ని సంశయించండి. కాని అనుభవాన్ని మాత్రం ఎన్నడూ సంశయించవద్దు.


97. When thou affirmest thy soul-experience & deniest the different soul-experience of another, know that God is making a fool of thee. Dost thou not hear His self-delighted laughter
behind thy soul's curtains?

97. మీ ఆత్మానుభూతిని సమర్ధించుకుంటూ, ఇతరుల ఆత్మానుభూతిని త్రోసిపుచ్చుతున్నప్పుడు భగవంతుడు మిమ్మల్ని హేళన చేస్తున్నాడని గుర్తుంచుకోండి. మీ ఆత్మ తెరల మాటున ఆయన హాయిగా నవ్వుకోవడం మీకు వినిపించలేదూ?


98. Revelation is the direct sight, the direct hearing or the inspired memory of Truth, drishti, sruti, smriti; it is the highest experience and always accessible to renewed experience. Not
because God spoke it, but because the soul saw it, is the word of the Scriptures our supreme authority.

98. సత్యం యొక్క దర్శన, శ్రుతి, స్మృతులనే జ్ఞానప్రకాశనం అంటారు. అది పరమోత్కృష్టమైన అనుభవం. పునరనుభూతి చేత దాని నిర్ధారణ సాధ్యమవుతుంది. భగవంతుడి నోటి మాట అని కాదు, ఆత్మ దర్శించినది కనుకనే శాస్త్ర వాక్యం మనకు శిరోధార్యం అవుతుంది.


99. The word of Scripture is infallible; it is in the interpretation the heart and reason put upon the Scripture that error has her portion.

99. శ్రుతి వాక్యం అనుల్లంఘనీయమే. మనస్సు, హృదయము దాన్ని అన్వయించే తీరు లోనే పొరబాటుకు తావు ఏర్పడుతుంది.


100. Shun all lowness, narrowness & shallowness in religious thought & experience. Be wider than the widest horizons, be loftier than the highest Kanchenjunga, be profounder than the
deepest oceans.

100.  విశాలతలో వినిలాకాశాలని మించిపోవాలి, ఉన్నతిలో మహోన్నతమైన కాంచనగంగను అధిగమించాలి, లోతులో ప్రగాఢ మహార్ణవాలని అతిశయించాలి.

Friday, February 7, 2014

సూక్తులు-సుభాషితాలు (81-90)




81. God's laughter is sometimes very coarse and unfit for polite ears; He is not satisfied with being Moliere, He must needs also be Aristophanes and Rabelais.

81. భగవంతుడి నవ్వు కొన్ని సార్లు కటువుగా ఉంటుంది. అది సంస్కారుల చెవులకి రుచించదు.  అతడు మోలియే కావడంతో సరిపెట్టుకోడు. అతడు అరిస్టోఫేన్స్, రబెలే లు కూడా కావలసిందే.


82. If men took life less seriously, they could very soon make
it more perfect. God never takes His works seriously; therefore
one looks out on this wonderful Universe.



83. Shame has admirable results and both in aesthetics and in morality we could ill spare it; but for all that it is a badge of weakness and the proof of ignorance.

సౌందర్యశాస్త్రంలోనే కాక, నైతికత పరంగా కూడా లజ్జ అనేది సత్ఫలితాలని ఇస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చెయ్యలేం. అయినా కూడా ఒక విధంగా బలహీనతకి చిహ్నం, అజ్ఞానానికి గుర్తు.



84. The supernatural is that the nature of which we have not attained or do not yet know, or the means of which we have not yet conquered. The common taste for miracles is the sign that
man's ascent is not yet finished.

85. మనం ప్రకృతికి అతీతం అనుకునేది మనం ఇంకా సాధించని, అర్థం చేసుకోని, లేదా దేని సాధన మార్గాన్నయితే ఇంకా జయించని, తత్వం అన్నమాట. మహత్యాల పట్ల మనుషుల్లో ఉండే సహజమైన పిపాస మానవ ఆరోహణా క్రమం ఇంకా ముగియలేదనడానికి ఆధారం.

85. It is rationality and prudence to distrust the supernatural; but to believe in it, is also a sort of wisdom.
85. ప్రకృతికి అతీతమైన దాన్ని విశ్వసించకపోవడం అనేది హేతువాదం కావచ్చు, వివేచన కావచ్చు. కాని దాన్ని నమ్మడంలో కూడా ఒక విధమైన వివేకం వుంది.

86. Great saints have performed miracles; greater saints have railed at them; the greatest have both railed at them and performed them.

86. గొప్ప సిద్ధులు మహత్యాలు చేశారు. ఇంకా గొప్ప సిద్ధులు వాటిని దునుమాడారు. అందరికన్నా ఘనులైన సిద్ధులు ఒక పక్క వాటిని తెగడుతూనే వాటిని చేసి చూపించారు.


87. Open thy eyes and see what the world really is and what God; have done with vain and pleasant imaginations.
87. ఒక సారి కళ్లు తెరిచి నిజంగా ప్రపంచం ఏమిటో, దేవుడు ఎలాంటి వాడో  కళ్ళారా చూడు. పనికిమాలిన తీయని ఊహాగానాలని ఇక పక్కన బెట్టు.


88. This world was built by Death that he might live. Wilt thou abolish death? Then life too will perish. Thou canst not abolish death, but thou mayst transform it into a greater living.

88. ఈ ప్రపంచాన్ని మృత్యువు నిర్మించింది, తాను జీవించాలని. మీరు మృత్యువుని నిషేధించ దలచారా? అయితే జీవనం కూడా నశిస్తుంది. మీరు మృత్యువుని నిషేధించలేరు గాని దాన్ని మరింత దివ్యమైన జీవనంగా రూపాంతరీకరించగలరు.

89. This world was built by Cruelty that she might love. Wilt thou abolish cruelty? Then love too will perish. Thou canst not abolish cruelty, but thou mayst transfigure it into its opposite,
into a fierce Love & Delightfulness.
89. క్రూరత్వం ఈ ప్రపంచాన్ని నిర్మించింది, తాను ప్రేమను చవిచూడాలని. మీరు క్రూరత్వాన్ని నిషేధించదలచారా? అప్పుడు ప్రేమ కూడా నిషేధిస్తుంది. క్రూరత్వాన్ని మీరు నిషేధించలేరు. దాని వ్యతిరేకాలైన తీక్షణమైన ప్రేమ, ప్రగాఢమైన ఆనందాల క్రింద దాన్ని రూపాంతరం గావించగలరు.

90. This world was built by Ignorance&Error that theymight  know. Wilt thou abolish ignorance and error? Then knowledge too will perish. Thou canst not abolish ignorance & error, but
thou mayst transmute them into the utter & effulgent exceeding of reason.

90. అజ్ఞానం, తెలియమి ఈ ప్రపంచాన్ని నిర్మించాయి. మీరు అజ్ఞానాన్ని, తెలియమిని నిషేధిస్తారా? అప్పుడు జ్ఞానం కూడా సమసిపోతుంది. అజ్ఞానాన్ని, తెలియమిని నిషేధించలేరు. వాటిని వివేచనకి అతీతమైన ఒక ప్రభావంతమైన స్థితిగా పరివర్తన మొరనరించగలరు.

Tuesday, January 28, 2014

సూక్తులు-సుభాషితాలు (71-80)

71. A thought is an arrow shot at the truth; it can hit a point, but not cover the whole target. But the archer is too well satisfied with his success to ask anything farther.
71. సత్యానికి గురి పెట్టి వేసిన బాణమే ఆలోచన. అది ఏదో ఒక బిందువునే ఛేదిస్తుంది గాని లక్ష్యం యావత్తుని ఆక్రమించలేదు. కాని విలుకాడు అంతకు మించి ఆశించక అంతటితో తృప్తిపడతాడు.

72. The sign of dawning Knowledge is to feel that as yet I know little or nothing, & yet, if I could only know my knowledge, I already possess everything.

72. నేటికి నాకు తెలిసినది ఏమీ కాదు అన్న భావన నాలో జ్ఞానాంకురానికి సూచన. అయినప్పటికి నాకున్న జ్ఞానాన్ని నేను సంపూర్ణంగా గ్రహించగలిగితే సర్వమూ నాకు అర్థమైనట్లే.

73. WhenWisdom comes, her ®rst lesson is, “There is no such thing as knowledge; there are only aperËcus of the Infinite Deity.”

73. జ్ఞానం ఉదయించినప్పుడు ఆమె నేర్పే మొదటి పాఠం ఇది – “అసలు జ్ఞానం అనేదే లేదు; ఉన్నదంతా కేవలం అనంత భగవత్తత్వం యొక్క క్షణకాల సందర్శనాలే.”

74. Practical knowledge is a different thing; that is real and serviceable, but it is never complete. Therefore to systematize and codify it is necessary but fatal.
74.  లౌకిక జ్ఞానపు తీరు వేరు. అది వాస్తవమైనది, ఉపయోగితమైనదే కాని ఎన్నటికీ సంపూర్ణం కాలేదు.  క్రమ బద్ధం చేసి, వ్యవస్థీకరించే కృషి అవసరమైనదే, కాని వినాశకరమైనది.

75. Systematise we must, but even in making & holding the system, we should always keep firm hold on this truth that all systems are in their nature transitory and incomplete.

75. వ్యవస్థీకరణ అవసరమే కాని మనం వ్యవస్థను నిర్మించేటప్పుడు వ్యవస్థలన్నీ తాత్కాలికాలే, అసంపూర్ణాలే నన్న సత్యాన్ని స్థిరంగా జ్ఞాపకం పెట్టుకోవాలి.

76. Europe prides herself on her practical and scientific organization and efficiency. I am waiting till her organisation is perfect; then a child shall destroy her.

76. యూరప్ తన శాస్త్రీయ వ్యవస్థను, భౌతిక సమర్థతను చూసుకుని గర్విస్తుంది. ఆ వ్యవస్థ పరిపూర్ణం కావాలని ఎదురుచూస్తున్నా. అప్పుడొక పసివాడు దాన్ని నాశనం చేస్తాడు.

77. Genius discovers a system; average talent stereotypes it till it is shattered by fresh genius. It is dangerous for an army to be led by veterans; for on the other side God may place Napoleon.

77. మేధావి ఒక పద్ధతిని కనుగొంటాడు. మధ్యమైన ప్రతిభ దాన్ని అలవాటుగా అనుకరిస్తుండగా మరో మేధావి వచ్చి దాన్ని భంగం చేస్తాడు. కేవలం అనుభవజ్ఞులైన వృద్ధుల నియంతృత్వంలో ఉండడం సైన్యానికి శ్రేయస్కరం కాడు. ప్రతిపక్షంలో భగవంతుడు నెపోలియన్ ని నియమించి ఉండొచ్చు.

78. When knowledge is fresh in us, then it is invincible; when it is old, it loses its virtue. This is because God moves always forward.

78. మనలో జ్ఞానం స్వచ్ఛంగా, సజీవంగా ఉన్నపుడు అజేయమౌతుంది. పాతబడినప్పుడు శక్తిని కోల్పోతుంది. ఎందుకంటే భగవంతుడు సదా ముందుకి సాగిపోతుంటాడు.

79. God is infinite Possibility. Therefore Truth is never at rest; therefore, also, Error is justified of her children.
79. అనంతావకాశమే భగవంతుడు. కనుకనే సత్యమెప్పుడూ విశ్రమించదు. అందుకే పొరబాటుకి కూడా తన సంతతి కారణంగా ఒక సముచిత స్థానం ఉంటుంది.

80.  కొందరు భక్తజనుల మాటలు వింటున్నప్పుడు భగంవతుడు అసలు నవ్వంటే ఎరగని వాడేమో ననిపిస్తుంది; దేవుడిలో దివ్యమైన అరిస్టోఫేన్స్ వున్నాడన్న హెయిన్స్ ఓ సత్యాన్ని గుర్తించాడు.
80. To listen to some devout people, one would imagine that God never laughs; Heine was nearer the mark when he found in Him the divine Aristophanes.