Sri Aurobindo and the Mother

Sri Aurobindo and the Mother

Wednesday, February 19, 2014

సూక్తులు - సుభాషితాలు (91-100)



91. If Life alone were & not death, there could be no immortality; if love were alone&not cruelty, joy would be only a tepid & ephemeral rapture; if reason were alone & not ignorance, our highest attainment would not exceed a limited rationality & worldly wisdom.

91. జీవనమే ఉండి మృత్యువే లేకుంటే అమరత్వమే ఉండేది కాదు. ప్రేమే ఉండి క్రూరత్వం లేకుంటే ఆనందం కేవలమొక పేలవమైన, క్షణికమైన హాయి మాత్రమే అయ్యేది. వివేచనా శక్తి మాత్రమే ఉండి అజ్ఞానం లేకుంటే, కొంత పరిమితమైన విచక్షణా జ్ఞానం, లౌకిక ప్రతిభ – ఇవే మనకు దక్కే పరమ ఫలితాలు అవుతాయి.


92. Death transformed becomes Life that is Immortality; Cruelty transfigured becomes Love that is intolerable ecstasy; Ignorance transmuted becomes Light that leaps beyond wisdom and
knowledge.

92.  పరివర్తన చెందిన మృత్యువే అమరమైన జీవనం అవుతుంది. రూపాంతరం చెందిన క్రౌర్యమే ప్రేమ అవుతుంది, ఓపలేని పారవశ్యమవుతుంది; మార్పునొందిన అజ్ఞానమే వివేచనని, జ్ఞానాన్ని అధిగమించే తేజం అవుతుంది.


93. Pain is the touch of our Mother teaching us how to bear and grow in rapture. She has three stages of her schooling, endurance first, next equality of soul, last ecstasy.

93. ఓరిమి చేత ఆనందం ఎలా పెరుగుతుందో ఆ లోకమాత నేర్పే పాఠమే బాధ. ఆమె నేర్పే విద్యలో మూడు దశలు ఉన్నాయి – ముందు ఓర్చుకోవడం, ఆ తరువాత సమత, చివరిగా ఆనంద పారవశ్యం.


94. All renunciation is for a greater joy yet ungrasped. Some renounce for the joy of duty done, some for the joy of peace, some for the joy of God and some for the joy of self-torture, but renounce rather as a passage to the freedom and untroubled rapture beyond.

94. ఇంతవరకు పొందని ఆనందాన్ని పొందడం కోసమే త్యాగం. కొందరు కర్తవ్యనిర్వహణలోని ఆనందం కోసం త్యాగం చేస్తారు. కొందరు ప్రశాంతత లోని ఆనందం కోసం, కొందరు భగవదానందం కోసం, మరి కొందరు ఆత్మహింసలోని ఆనందం కోసం త్యాగాలు చేస్తారు. కాని త్యాగాన్ని స్వేచ్ఛను సాధించే మార్గంగా గుర్తించి అక్షోభమైన పరమానందం కోసమే త్యాగం చెయ్యాలి.


95. Only by perfect renunciation of desire or by perfect satisfaction of desire can the utter embrace of God be experienced; for in both ways the essential precondition is effected,- desire perishes.

95.  కోర్కెను పూర్తిగా త్యజించినపుడైనా, లేదా కోర్కెను పూర్తిగా నెరవేర్చుకున్నపుడైనా భగవంతుడి పరమపరిష్వంగం అనుభవమవుతుంది. ఎందుకంటే ఈ రెండు మార్గాలలోనూ అవశ్యమైనది ముందుగా జరిగిపోతోంది – కోర్కె నశించిపోతోంది.


96. Experience in thy soul the truth of the Scripture; afterwards, if thou wilt, reason & state thy experience intellectually & even then distrust thy statement; but distrust never thy experience.

96.  శాస్త్రవాక్యాన్ని మీ ఆత్మలోనే అనుభవించండి. ఆ తరువాత కావాలంటే మీ అనుభవాన్ని మనసుకి తెలిసేలా నిర్వచించండి. ఇంకా అవసరమైతే ఆ నిర్వచనాన్ని సంశయించండి. కాని అనుభవాన్ని మాత్రం ఎన్నడూ సంశయించవద్దు.


97. When thou affirmest thy soul-experience & deniest the different soul-experience of another, know that God is making a fool of thee. Dost thou not hear His self-delighted laughter
behind thy soul's curtains?

97. మీ ఆత్మానుభూతిని సమర్ధించుకుంటూ, ఇతరుల ఆత్మానుభూతిని త్రోసిపుచ్చుతున్నప్పుడు భగవంతుడు మిమ్మల్ని హేళన చేస్తున్నాడని గుర్తుంచుకోండి. మీ ఆత్మ తెరల మాటున ఆయన హాయిగా నవ్వుకోవడం మీకు వినిపించలేదూ?


98. Revelation is the direct sight, the direct hearing or the inspired memory of Truth, drishti, sruti, smriti; it is the highest experience and always accessible to renewed experience. Not
because God spoke it, but because the soul saw it, is the word of the Scriptures our supreme authority.

98. సత్యం యొక్క దర్శన, శ్రుతి, స్మృతులనే జ్ఞానప్రకాశనం అంటారు. అది పరమోత్కృష్టమైన అనుభవం. పునరనుభూతి చేత దాని నిర్ధారణ సాధ్యమవుతుంది. భగవంతుడి నోటి మాట అని కాదు, ఆత్మ దర్శించినది కనుకనే శాస్త్ర వాక్యం మనకు శిరోధార్యం అవుతుంది.


99. The word of Scripture is infallible; it is in the interpretation the heart and reason put upon the Scripture that error has her portion.

99. శ్రుతి వాక్యం అనుల్లంఘనీయమే. మనస్సు, హృదయము దాన్ని అన్వయించే తీరు లోనే పొరబాటుకు తావు ఏర్పడుతుంది.


100. Shun all lowness, narrowness & shallowness in religious thought & experience. Be wider than the widest horizons, be loftier than the highest Kanchenjunga, be profounder than the
deepest oceans.

100.  విశాలతలో వినిలాకాశాలని మించిపోవాలి, ఉన్నతిలో మహోన్నతమైన కాంచనగంగను అధిగమించాలి, లోతులో ప్రగాఢ మహార్ణవాలని అతిశయించాలి.

Friday, February 7, 2014

సూక్తులు-సుభాషితాలు (81-90)




81. God's laughter is sometimes very coarse and unfit for polite ears; He is not satisfied with being Moliere, He must needs also be Aristophanes and Rabelais.

81. భగవంతుడి నవ్వు కొన్ని సార్లు కటువుగా ఉంటుంది. అది సంస్కారుల చెవులకి రుచించదు.  అతడు మోలియే కావడంతో సరిపెట్టుకోడు. అతడు అరిస్టోఫేన్స్, రబెలే లు కూడా కావలసిందే.


82. If men took life less seriously, they could very soon make
it more perfect. God never takes His works seriously; therefore
one looks out on this wonderful Universe.



83. Shame has admirable results and both in aesthetics and in morality we could ill spare it; but for all that it is a badge of weakness and the proof of ignorance.

సౌందర్యశాస్త్రంలోనే కాక, నైతికత పరంగా కూడా లజ్జ అనేది సత్ఫలితాలని ఇస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చెయ్యలేం. అయినా కూడా ఒక విధంగా బలహీనతకి చిహ్నం, అజ్ఞానానికి గుర్తు.



84. The supernatural is that the nature of which we have not attained or do not yet know, or the means of which we have not yet conquered. The common taste for miracles is the sign that
man's ascent is not yet finished.

85. మనం ప్రకృతికి అతీతం అనుకునేది మనం ఇంకా సాధించని, అర్థం చేసుకోని, లేదా దేని సాధన మార్గాన్నయితే ఇంకా జయించని, తత్వం అన్నమాట. మహత్యాల పట్ల మనుషుల్లో ఉండే సహజమైన పిపాస మానవ ఆరోహణా క్రమం ఇంకా ముగియలేదనడానికి ఆధారం.

85. It is rationality and prudence to distrust the supernatural; but to believe in it, is also a sort of wisdom.
85. ప్రకృతికి అతీతమైన దాన్ని విశ్వసించకపోవడం అనేది హేతువాదం కావచ్చు, వివేచన కావచ్చు. కాని దాన్ని నమ్మడంలో కూడా ఒక విధమైన వివేకం వుంది.

86. Great saints have performed miracles; greater saints have railed at them; the greatest have both railed at them and performed them.

86. గొప్ప సిద్ధులు మహత్యాలు చేశారు. ఇంకా గొప్ప సిద్ధులు వాటిని దునుమాడారు. అందరికన్నా ఘనులైన సిద్ధులు ఒక పక్క వాటిని తెగడుతూనే వాటిని చేసి చూపించారు.


87. Open thy eyes and see what the world really is and what God; have done with vain and pleasant imaginations.
87. ఒక సారి కళ్లు తెరిచి నిజంగా ప్రపంచం ఏమిటో, దేవుడు ఎలాంటి వాడో  కళ్ళారా చూడు. పనికిమాలిన తీయని ఊహాగానాలని ఇక పక్కన బెట్టు.


88. This world was built by Death that he might live. Wilt thou abolish death? Then life too will perish. Thou canst not abolish death, but thou mayst transform it into a greater living.

88. ఈ ప్రపంచాన్ని మృత్యువు నిర్మించింది, తాను జీవించాలని. మీరు మృత్యువుని నిషేధించ దలచారా? అయితే జీవనం కూడా నశిస్తుంది. మీరు మృత్యువుని నిషేధించలేరు గాని దాన్ని మరింత దివ్యమైన జీవనంగా రూపాంతరీకరించగలరు.

89. This world was built by Cruelty that she might love. Wilt thou abolish cruelty? Then love too will perish. Thou canst not abolish cruelty, but thou mayst transfigure it into its opposite,
into a fierce Love & Delightfulness.
89. క్రూరత్వం ఈ ప్రపంచాన్ని నిర్మించింది, తాను ప్రేమను చవిచూడాలని. మీరు క్రూరత్వాన్ని నిషేధించదలచారా? అప్పుడు ప్రేమ కూడా నిషేధిస్తుంది. క్రూరత్వాన్ని మీరు నిషేధించలేరు. దాని వ్యతిరేకాలైన తీక్షణమైన ప్రేమ, ప్రగాఢమైన ఆనందాల క్రింద దాన్ని రూపాంతరం గావించగలరు.

90. This world was built by Ignorance&Error that theymight  know. Wilt thou abolish ignorance and error? Then knowledge too will perish. Thou canst not abolish ignorance & error, but
thou mayst transmute them into the utter & effulgent exceeding of reason.

90. అజ్ఞానం, తెలియమి ఈ ప్రపంచాన్ని నిర్మించాయి. మీరు అజ్ఞానాన్ని, తెలియమిని నిషేధిస్తారా? అప్పుడు జ్ఞానం కూడా సమసిపోతుంది. అజ్ఞానాన్ని, తెలియమిని నిషేధించలేరు. వాటిని వివేచనకి అతీతమైన ఒక ప్రభావంతమైన స్థితిగా పరివర్తన మొరనరించగలరు.

Tuesday, January 28, 2014

సూక్తులు-సుభాషితాలు (71-80)

71. A thought is an arrow shot at the truth; it can hit a point, but not cover the whole target. But the archer is too well satisfied with his success to ask anything farther.
71. సత్యానికి గురి పెట్టి వేసిన బాణమే ఆలోచన. అది ఏదో ఒక బిందువునే ఛేదిస్తుంది గాని లక్ష్యం యావత్తుని ఆక్రమించలేదు. కాని విలుకాడు అంతకు మించి ఆశించక అంతటితో తృప్తిపడతాడు.

72. The sign of dawning Knowledge is to feel that as yet I know little or nothing, & yet, if I could only know my knowledge, I already possess everything.

72. నేటికి నాకు తెలిసినది ఏమీ కాదు అన్న భావన నాలో జ్ఞానాంకురానికి సూచన. అయినప్పటికి నాకున్న జ్ఞానాన్ని నేను సంపూర్ణంగా గ్రహించగలిగితే సర్వమూ నాకు అర్థమైనట్లే.

73. WhenWisdom comes, her ®rst lesson is, “There is no such thing as knowledge; there are only aperËcus of the Infinite Deity.”

73. జ్ఞానం ఉదయించినప్పుడు ఆమె నేర్పే మొదటి పాఠం ఇది – “అసలు జ్ఞానం అనేదే లేదు; ఉన్నదంతా కేవలం అనంత భగవత్తత్వం యొక్క క్షణకాల సందర్శనాలే.”

74. Practical knowledge is a different thing; that is real and serviceable, but it is never complete. Therefore to systematize and codify it is necessary but fatal.
74.  లౌకిక జ్ఞానపు తీరు వేరు. అది వాస్తవమైనది, ఉపయోగితమైనదే కాని ఎన్నటికీ సంపూర్ణం కాలేదు.  క్రమ బద్ధం చేసి, వ్యవస్థీకరించే కృషి అవసరమైనదే, కాని వినాశకరమైనది.

75. Systematise we must, but even in making & holding the system, we should always keep firm hold on this truth that all systems are in their nature transitory and incomplete.

75. వ్యవస్థీకరణ అవసరమే కాని మనం వ్యవస్థను నిర్మించేటప్పుడు వ్యవస్థలన్నీ తాత్కాలికాలే, అసంపూర్ణాలే నన్న సత్యాన్ని స్థిరంగా జ్ఞాపకం పెట్టుకోవాలి.

76. Europe prides herself on her practical and scientific organization and efficiency. I am waiting till her organisation is perfect; then a child shall destroy her.

76. యూరప్ తన శాస్త్రీయ వ్యవస్థను, భౌతిక సమర్థతను చూసుకుని గర్విస్తుంది. ఆ వ్యవస్థ పరిపూర్ణం కావాలని ఎదురుచూస్తున్నా. అప్పుడొక పసివాడు దాన్ని నాశనం చేస్తాడు.

77. Genius discovers a system; average talent stereotypes it till it is shattered by fresh genius. It is dangerous for an army to be led by veterans; for on the other side God may place Napoleon.

77. మేధావి ఒక పద్ధతిని కనుగొంటాడు. మధ్యమైన ప్రతిభ దాన్ని అలవాటుగా అనుకరిస్తుండగా మరో మేధావి వచ్చి దాన్ని భంగం చేస్తాడు. కేవలం అనుభవజ్ఞులైన వృద్ధుల నియంతృత్వంలో ఉండడం సైన్యానికి శ్రేయస్కరం కాడు. ప్రతిపక్షంలో భగవంతుడు నెపోలియన్ ని నియమించి ఉండొచ్చు.

78. When knowledge is fresh in us, then it is invincible; when it is old, it loses its virtue. This is because God moves always forward.

78. మనలో జ్ఞానం స్వచ్ఛంగా, సజీవంగా ఉన్నపుడు అజేయమౌతుంది. పాతబడినప్పుడు శక్తిని కోల్పోతుంది. ఎందుకంటే భగవంతుడు సదా ముందుకి సాగిపోతుంటాడు.

79. God is infinite Possibility. Therefore Truth is never at rest; therefore, also, Error is justified of her children.
79. అనంతావకాశమే భగవంతుడు. కనుకనే సత్యమెప్పుడూ విశ్రమించదు. అందుకే పొరబాటుకి కూడా తన సంతతి కారణంగా ఒక సముచిత స్థానం ఉంటుంది.

80.  కొందరు భక్తజనుల మాటలు వింటున్నప్పుడు భగంవతుడు అసలు నవ్వంటే ఎరగని వాడేమో ననిపిస్తుంది; దేవుడిలో దివ్యమైన అరిస్టోఫేన్స్ వున్నాడన్న హెయిన్స్ ఓ సత్యాన్ని గుర్తించాడు.
80. To listen to some devout people, one would imagine that God never laughs; Heine was nearer the mark when he found in Him the divine Aristophanes.

Saturday, January 18, 2014

సూక్తులు - సుభాషితాలు (61-70)



61. There is no mortality. It is only the Immortal who can die; the mortal could neither be born nor perish. There is nothing finite. It is only the Infinite who can make for Himself limits; the finite can have no beginning nor end, for the very act of conceiving its beginning & end declares its infinity.

61. అసలు మర్త్య స్థితి అనేదే లేదు. ఒక్క అమృత స్వరూపుడికే మరణం సాధ్యం. మర్త్యమైనది అసలు పుట్టలేదు, నాశనమూ కాలేదు. అట్లాగే మితమైనది ఏదీ లేదు. ఒక్క అనంతుడే తనకు తాను పరిమితాలను ఏర్పరచుకోగలడు. మితానికి మొదలూ ఉండదు, అంతమూ ఉండదు. ఎందుకంటే దాని ఆద్యంతాలని గుర్తించిన మరుక్షణం దాని అనంతత బట్టబయలు అవుతుంది.

62. I heard a fool discoursing utter folly and wondered what God meant by it; then I considered and saw a distorted mask of truth and wisdom.

62. అర్థరహిత ప్రేలాపన కొనసాగిస్తున్న ఒక మూర్ఖుణ్ణి చూసి ఆ  భాషణ జరిపించడంలో భగవంతుడి ఉద్దేశం ఏమిటా అనుకున్నాను. అప్పుడు సూక్ష్మంగా గమనించగా అందులో ముసుగుదేలి వున్న సత్యం, మరుగుపడి వున్న ప్రజ్ఞ వెల్లడి అయ్యాయి.


63. God is great, says the Mahomedan. Yes, He is so great that He can afford to be weak, whenever that too is necessary.

63. దేవుడు ఘనుడు అంటాడు మహ్మదీయుడు. అవును, అతడు ఎంతటి ఘనుడంటే సందర్భం వచ్చినప్పుడు అతి దుర్బలుడిగా కూడా ప్రవర్తించగలడు.

64. God often fails in His workings; it is the sign of His illimitable godhead.

64. భగవంతుడు తన కార్యంలో ఎన్నో సార్లు వైఫల్యాన్ని పొందుతాడు. అనవధికమైన ఆయన దివ్యత్వానికి అది సంకేతం.

65. Because God is invincibly great, He can afford to be weak; because He is immutably pure, He can indulge with impunity in sin; He knows eternally all delight, therefore He tastes also
the delight of pain; He is inalienably wise, therefore He has not debarred Himself from folly.

65.  భగవంతుడు అజేయమైన ఘనత గలవాడు గనుక దీనుడై కూడా మనగలడు; మారని నైర్మల్యం ఉన్నవాడు కనుక పాపర్మ అతణ్ణి కళంక పరచదు; అనాదిగా ఆనందసర్వాన్నీ ఎరిగినవాడు కనుక బాధ అనే ఆనందాన్ని కూడా రుచి చూస్తాడు; సంపూర్ణ జ్ఞాని కనుక పొరబాట్లు చేసే అవకాశాన్ని కూడా  వొదులుకోడు.

66. Sin is that which was once in its place, persisting now it is out of place; there is no other sinfulness.

66. ఒకప్పుడు సందర్భోచితంగా ఉన్నా, ఇప్పుడు అసందర్భమై, అపభ్రంశమైనదే పాపం. అది తప్ప  ఇక వేరే పాపమనేదే లేదు.


67. There is no sin in man, but a great deal of disease, ignorance and misapplication.

67. మనిషిలో పాపం లేదు గాని గంపెడంత అస్వస్థత, అజ్ఞానం, అనుచిత వర్తనం ఉన్నాయి.

68. The sense of sin was necessary in order that man might become disgusted with his own imperfections. It was God's corrective for egoism. Butman's egoism meets God's device by being very dully alive to its own sins and very keenly alive to the sins of others.

68. పాపబీతి అన్నది మనిషిలో తన అపరిపక్వత పట్ల అసహ్యం పుట్టించడానికి అవసరం అయ్యింది. అది అహంకారాన్ని నయం చెయ్యడానికి భగవంతుడు ఏర్పరిచిన విరుగుడు. కాని మనిషిలో అహంకారం తన పాపాలను తగినంతగా గుర్తించుకోక, అన్యుల పాపాలని అతిగా గుర్తిస్తూ భగంవంతుడి ఏర్పాటుని వమ్ము చేస్తోంది.

69. Sin & virtue are a game of resistance we play with God in His efforts to draw us towards perfection. The sense of virtue helps us to cherish our sins in secret.

69. పరిపూర్ణత దిక్కుగా మనను నడిపించే ప్రయాసలో భగవంతుడి కృషిని నిరోధిస్తూ మనం ఆడే ఆటలే పాపపుణ్యాలు. మనం పునీతులం అన్న భావన మన పాపాలని గుప్తంగా దాచుకోవడానికి ఉపయోగపడుతోంది.

70. Examine thyself without pity, then thou wilt be more charitable and pitiful to others.

70. నిర్దయగా నిన్ను నీవు పరీక్షించుకో. అప్పుడు ఇతరుల పట్ల నీవు మరింత జాలి, దయ కలిగి ఉంటావు.