Sri Aurobindo and the Mother

Sri Aurobindo and the Mother

Tuesday, January 7, 2014

దివ్యజనని ఆరాధన (ఆఖరి భాగం)



This was a seed cast into endless Time.
A Word is spoken or a Light is shown,
A moment sees, the ages toil to express.
So flashing out of the Timeless leaped the worlds;
An eternal instant is the cause of the years.
All he had done was to prepare a field;
His small beginnings asked for a mighty end:
For all that he had been must now new-shape
In him her joy to embody, to enshrine
Her beauty and greatness in his house of life.
But now his being was too wide for self;
His heart’s demand had grown immeasurable:
His single freedom could not satisfy,
Her light, her bliss he asked for earth and men.
But vain are human power and human love
To break earth’s seal of ignorance and death;
His nature’s might seemed now an infant’s grasp;
Heaven is too high for outstretched hands to seize.
This Light comes not by struggle or by thought;
In the mind’s silence the Transcendent acts
And the hushed heart hears the unuttered Word.
A vast surrender was his only strength.
A Power that lives upon the heights must act,
Bring into life’s closed room the Immortal’s air
And fill the finite with the Infinite.
All that denies must be torn out and slain
And crushed the many longings for whose sake
We lose the One for whom our lives were made.
Now other claims had hushed in him their cry:
Only he longed to draw her presence and power
Into his heart and mind and breathing frame;
Only he yearned to call for ever down
Her healing touch of love and truth and joy
Into the darkness of the suffering world.
His soul was freed and given to her alone.



అంతులేని కాలంలో నాటబడ్డ బీజం ఇది.
ఒక వాణి పలికింది, ఒక కాంతి వెల్లడి అయ్యింది,
క్షణాలు దర్శించిన దాన్ని, యుగాలు శ్రమించి వ్యక్తం చేస్తాయి.
కాలాతీతం నుండి మెరుపుల్లా పెల్లుబికాయి ప్రపంచాలు;
ఓ నిత్య తరుణం సంవత్సరాలకి కారణభూతం అయ్యింది.
అతడు చేసిన దల్లా క్షేత్రాన్ని సిద్ధం చెయ్యడమే;
అతడి స్వల్ప తొలి యత్నాలు ఘనమైన ముగింపును కోరాయి:
అతడి గతమంతా ఇప్పుడు  నవ్యంగా రూపొందాలి
ఆమె ఆనందాన్ని తనలో పోతపోసుకోవాలని,
ఆమె అందానికి, మహత్తుకు తన జీవనాలయంలో గుడికట్టాలని.
కాని ఇప్పుడు అతడి వ్యక్తి ఆత్మ కన్నా విశాలం అయ్యింది;
అతడి హృదయం లోని ఆకాంక్ష అమాంతంగా పెరిగిపోయింది:
ఏకాంత స్వేచ్ఛ అతడికి సంతృప్తి నీయలేకపోయింది,
భూమి కోసం, మనుషుల కోసం ఆమె తేజాన్ని, ఆనందాన్ని కోరుకున్నాడు.
కాని అజ్ఞానంతో, మృత్యువుతో కూడుకున్న భూమి పాశాన్ని తెంచేందుకు
మానవ శక్తి, మానవ ప్రేమ నిష్ప్రయోజకాలు;
అతడి ప్రకృతి యొక్క శక్తి ఓ పసికందు సత్తా వంటిది;
అల్లార్చే చేతులకి అందనంత ఎత్తులో వుంది స్వర్గం.
ప్రయత్నం వల్ల, ఆలోచన వల్ల దిగి వచ్చే కాంతి కాదిది;
మనస్సు యొక్క మౌనంలో పరమం పని చేస్తుంది
సద్దుమణిగిన హృదయం పలుకని పదాన్ని వింటుంది.
ఓ విశాల సమర్పణే అతడి  ఏకైక బలం.
ఎత్తులలో జీవించే ఓ శక్తి పని చెయ్యాలి,
జీవితపు మూసిన గదిలో అమర్త్యుడి గాలిని ప్రవేశపెట్టి
మితాన్ని అమితంతో పూరించాలి.
నిరాకరించే దానంతటినీ పెల్లగించాలి, హతమార్చాలి
ఏ అనన్యుడి కోసం అయితే మన జీవితాలు ఏర్పడ్డాయో
అతడి ప్రాప్తికి అడ్డుపడే మన పలు తపనలని అణగదొక్కాలి.
అతడిలోని ఇతర ఆశల ఆక్రందన లన్నీ సద్దుమణిగాయి:
తన హృదయంలోకి, మనస్సు లోకి, నిశ్వసించే దేహం లోకి
ఆమె సన్నిధిని, శక్తిని ఆకర్షించాలని మాత్రమే తపించాడు;
ఈ యాతనామయ ప్రపంచం యొక్క అంధకారం లోకి
ప్రేమ, సత్యం, ఆనందాల ఆమె మధుర స్పర్శ
దిగి వచ్చేలా చెయ్యాలని మాత్రమే పరితపించాడు.
అతడి ఆత్మ విడుదల పొంది, ఆమెకు మాత్రమే సమర్పించబడింది.

(End of the Canto Two – “Adoration of the Divine Mother”)







Sunday, January 5, 2014

దివ్యజనని ఆరాధన (3 వ భాగం)



She is the golden bridge, the wonderful fire.
The luminous heart of the Unknown is she,
A power of silence in the depths of God;
She is the Force, the inevitable Word,
The magnet of our difficult ascent,
The Sun from which we kindle all our suns,
The Light that leans from the unrealised Vasts,
The joy that beckons from the impossible,
The Might of all that never yet came down.
All Nature dumbly calls to her alone
To heal with her feet the aching throb of life
And break the seals on the dim soul of man
And kindle her fire in the closed heart of things.
All here shall be one day her sweetness’ home,
All contraries prepare her harmony;
Towards her our knowledge climbs, our passion gropes;
In her miraculous rapture we shall dwell,
Her clasp shall turn to ecstasy our pain.
Our self shall be one self with all through her.
In her confirmed because transformed in her,
Our life shall find in its fulfilled response
Above, the boundless hushed beatitudes,
Below, the wonder of the embrace divine.
This known as in a thunder-flash of God,
The rapture of things eternal filled his limbs;
Amazement fell upon his ravished sense;
His spirit was caught in her intolerant flame.
Once seen, his heart acknowledged only her.
Only a hunger of infinite bliss was left.
All aims in her were lost, then found in her;
His base was gathered to one pointing spire.

A translation:
ఆమె ఓ బంగరు వంతెన, ఓ అద్భుత జ్వాల.
అజ్ఞాతుడి  విరాజమాన హృదయం ఆమె,
భగవంతుడి లోతుల్లో నిశ్చలత్వపు ప్రాబల్యం.
ఆమె శక్తి, ఆమె అమోఘ వాక్కు,
మన దుస్తర ఆరోహణకు ఆకర్షిణి,
మన సూర్యులకి మూలతేజమైన భానుమూర్తి,
అవ్యక్త బృహత్తుల నుండి తారాడే తేజం,
అసంభవం నుండి ఆహ్వానించే ఆనందం,
మునుపెన్నడూ దిగిరాని గరిమ.
సమస్త ప్రకృతీ ఆమె కోసమే మూగగా పరితపిస్తుంది
ఆమె పదస్పర్శ బాధామయ జీవన స్పందనను నయం చేస్తుందని
అవిజ్ఞమైన మానవాత్మను బంధించే సంకెళ్లు తెంచుతుందని
మూతబడ్డ అంతరాళాలలో దాగిన ఆమె అగ్గిని రాజేస్తుందని.
ఇదంతా ఏదో ఒకనాడు ఆమె తియ్యదనానికి నెలవు కావాలి,
వైరుధ్యాలన్నీ ఆమె సామరస్యానికి సన్నాహం కావాలి;
ఆమె దిశగా మన జ్ఞానం ఆరోహిస్తుంది, మన తపన తడబడుతుంది;
ఆమె అద్భుత హర్షంలో మనం వసించాలి,
ఆమె స్పర్శలో మన వేదన హ్లాదంగా మారాలి.
ఆమె ద్వార మన ఆత్మ విశ్వాత్మతో ఏకం కావాలి.
ఆమెలో ధృవమై పరివర్తనమొందాలి జీవనం.
సఫలీకృతమైన మన జీవన ప్రతిస్పందన
పైన నీరవ నిరవధిక నిత్యానందాన్ని
కింద అద్భుత భగవదాలింగనాన్ని ఆవిష్కరిస్తుంది.
భగవంతుడి తటిల్లతా విన్యాసంలా తెలిసిందా సత్యం,
సనాతన విషయాల ఆహ్లాదం అతడి అంగాలని పూరించింది;
ఉక్కిరిబిక్కిరైన అతడి సంవేదనలని సంభ్రమం ఆవరించింది;
ఆమె అసహిష్ణు జ్వాలలో అతడి ఆత్మ బందీ అయ్యింది.
ఒకసారి చూశాక అతడి హృదయం ఆమెను మాత్రమే గుర్తించింది.
ఇక అనంతాహ్లాదపు ఆకలి మాత్రమే మిగిలింది.
శోధనలన్నీ ఆమెలో విలీనమై, తిరిగి ఆవిష్కృతం అయ్యాయి,
అతడి ఆధారం ఓ ఏకాగ్ర శిఖరంగా కేంద్రీకృతమయ్యింది.
(ఇంకా వుంది)

Friday, January 3, 2014

దివ్యజనని ఆరాధన (2 వ భాగం) - సావిత్రి కావ్యం నుండి

The Enigma ceased that rules our nature’s night,
The covering Nescience was unmasked and slain;
Its mind of error was stripped off from things
And the dull moods of its perverting will.
Illumined by her all-seeing identity
Knowledge and Ignorance could strive no more;
No longer could the titan Opposites,
Antagonist poles of the world’s artifice,
Impose the illusion of their twofold screen
Throwing their figures between us and her.
The Wisdom was near, disguised by its own works,
Of which the darkened universe is the robe.
No more existence seemed an aimless fall,
Extinction was no more the sole release.
The hidden Word was found, the long-sought clue,
Revealed was the meaning of our spirit’s birth,
Condemned to an imperfect body and mind,
In the inconscience of material things
And the indignity of mortal life.
A Heart was felt in the spaces wide and bare,
Annulled the sorrow of the ignorant depths;
Suffering was lost in her immortal smile.
A Life from beyond grew conqueror here of death;
To err no more was natural to mind;
Wrong could not come where all was light and love.
The Formless and the Formed were joined in her:
Immensity was exceeded by a look,
A Face revealed the crowded Infinite.
Incarnating inexpressibly in her limbs
The boundless joy the blind world-forces seek,
Her body of beauty mooned the seas of bliss.
At the head she stands of birth and toil and fate,
In their slow round the cycles turn to her call;
Alone her hands can change Time’s dragon base.
Hers is the mystery the Night conceals;
The spirit’s alchemist energy is hers;
She is the golden bridge, the wonderful fire.



మన ప్రకృతి యొక్క చీకటిని పాలించే చిక్కుముడి విడిపోయింది,
ఆవరించిన అచిత్తి ముసుగు తొలగించబడింది, తుదముట్టించబడింది;
దాని దోషభూయిష్ట మానసం విషయాల నుండి వేరు చేయబడింది
 దాని వికార సంకల్పానికి చెందిన తామసిక హృదయావేశాల నుండి వేరు చెయ్యబడింది.
ఆమె సార్వదర్శక తాదాత్మ్యం చేత ప్రకాశితమైన
జ్ఞానాజ్ఞానాలకు ఆయువు తీరిపోయింది;
లోకమనే కల్పనలో వ్యతిరేక ధృవాలైన,
ఆ బ్రహ్మాండమైన వైరుధ్యాలు
అమెను, మనను వేరు చేసే చిత్రాలని విక్షేపిస్తూ
రెండుపొరల తెర అనే భ్రాంతిని ఆపాదించలేకపోయాయి.
దాని సొంత కర్మల వెనుక మరుగుపడ్డ ప్రజ్ఞ ఇప్పుడు చేరువయ్యింది
అంధకారమయమైన విశ్వం ఆ ప్రజ్ఞ యొక్క వలిపమే.
ఇకపై అస్తిత్వం ఓ అర్థరహిత పతనంగా తోచలేదు,
విలయం ఏకైక విమోచన హేతువు అనిపించలేదు.
దీర్ఘకాల అన్వేషిత చిహ్నం, ఆ రహస్య శబ్దం తెలిసొచ్చింది.
అపరిపక్వ దేహ మానసాలకి విధిలేక పరిమితమై,
భౌతిక విషయాల అచిత్తిలో
మర్త్య జీవనమనే అగౌరవస్థితిలో
ఆత్మ యొక్క జన్మరహస్యం వెల్లడి అయ్యింది.
విశాల రిక్త  ప్రదేశాలలో ఓ హృదయం అనుభవమయ్యింది,
అవిజ్ఞమైన లోతుల్లోని శోకం వమ్మయ్యింది;
ఆమె అమర దరహాసంలో యాతన కరిగిపోయింది.
ఎక్కడో పుట్టిన జీవనం ఇక్కడ చావుపై విజేతగా ఎదిగింది;
పొరబడడం ఇప్పుడు మనసు సహజ లక్షణం కాదు;
అంతా ప్రకాశం, ప్రేమలు అలరారే చోట తప్పిదం పాదం మోపలేదు.
రూపం, అరూపం ఆమెలో ఏకం అయ్యాయి:
ఒక్క దృక్కుతో బృహత్తు అధిగమించబడింది,
కిక్కిరిసిన అనంతాన్ని ఓ ముఖం ప్రస్ఫుటం చేసింది.
అంధమైన విశ్వశక్తులు అన్వేషించే ఆనందాన్ని,
అవర్ణనీయంగా అంగాంగాలలో అవతరింపజేస్తూ
ఆమె అతిసుందర దేహం ఆనంద సాగరాలలో మైమరచిపోయింది.
జన్మకి, కృషికి, విధికి మూలంలో ఆమె నిలిచి వుంది,
మందంగా కదిలే యుగచక్రాలు ఆమె పిలుపు కోసం ఎదురు చూస్తాయి;
కాలం యొక్క రాకాసి పునాదిని కేవలం ఆమె చేతులే మార్చగలవు.
రాత్రి దాచే ప్రగాఢ రహస్యం ఆమెదే;
ఆత్మ యొక్క అద్భుత రూపాంతరకారక శక్తి ఆమెదే;
ఆమె ఓ బంగరు వంతెన, ఓ అద్భుత జ్వాల.
(ఇంకా వుంది)