Sri Aurobindo and the Mother

Sri Aurobindo and the Mother

Friday, January 3, 2014

దివ్యజనని ఆరాధన (2 వ భాగం) - సావిత్రి కావ్యం నుండి

The Enigma ceased that rules our nature’s night,
The covering Nescience was unmasked and slain;
Its mind of error was stripped off from things
And the dull moods of its perverting will.
Illumined by her all-seeing identity
Knowledge and Ignorance could strive no more;
No longer could the titan Opposites,
Antagonist poles of the world’s artifice,
Impose the illusion of their twofold screen
Throwing their figures between us and her.
The Wisdom was near, disguised by its own works,
Of which the darkened universe is the robe.
No more existence seemed an aimless fall,
Extinction was no more the sole release.
The hidden Word was found, the long-sought clue,
Revealed was the meaning of our spirit’s birth,
Condemned to an imperfect body and mind,
In the inconscience of material things
And the indignity of mortal life.
A Heart was felt in the spaces wide and bare,
Annulled the sorrow of the ignorant depths;
Suffering was lost in her immortal smile.
A Life from beyond grew conqueror here of death;
To err no more was natural to mind;
Wrong could not come where all was light and love.
The Formless and the Formed were joined in her:
Immensity was exceeded by a look,
A Face revealed the crowded Infinite.
Incarnating inexpressibly in her limbs
The boundless joy the blind world-forces seek,
Her body of beauty mooned the seas of bliss.
At the head she stands of birth and toil and fate,
In their slow round the cycles turn to her call;
Alone her hands can change Time’s dragon base.
Hers is the mystery the Night conceals;
The spirit’s alchemist energy is hers;
She is the golden bridge, the wonderful fire.



మన ప్రకృతి యొక్క చీకటిని పాలించే చిక్కుముడి విడిపోయింది,
ఆవరించిన అచిత్తి ముసుగు తొలగించబడింది, తుదముట్టించబడింది;
దాని దోషభూయిష్ట మానసం విషయాల నుండి వేరు చేయబడింది
 దాని వికార సంకల్పానికి చెందిన తామసిక హృదయావేశాల నుండి వేరు చెయ్యబడింది.
ఆమె సార్వదర్శక తాదాత్మ్యం చేత ప్రకాశితమైన
జ్ఞానాజ్ఞానాలకు ఆయువు తీరిపోయింది;
లోకమనే కల్పనలో వ్యతిరేక ధృవాలైన,
ఆ బ్రహ్మాండమైన వైరుధ్యాలు
అమెను, మనను వేరు చేసే చిత్రాలని విక్షేపిస్తూ
రెండుపొరల తెర అనే భ్రాంతిని ఆపాదించలేకపోయాయి.
దాని సొంత కర్మల వెనుక మరుగుపడ్డ ప్రజ్ఞ ఇప్పుడు చేరువయ్యింది
అంధకారమయమైన విశ్వం ఆ ప్రజ్ఞ యొక్క వలిపమే.
ఇకపై అస్తిత్వం ఓ అర్థరహిత పతనంగా తోచలేదు,
విలయం ఏకైక విమోచన హేతువు అనిపించలేదు.
దీర్ఘకాల అన్వేషిత చిహ్నం, ఆ రహస్య శబ్దం తెలిసొచ్చింది.
అపరిపక్వ దేహ మానసాలకి విధిలేక పరిమితమై,
భౌతిక విషయాల అచిత్తిలో
మర్త్య జీవనమనే అగౌరవస్థితిలో
ఆత్మ యొక్క జన్మరహస్యం వెల్లడి అయ్యింది.
విశాల రిక్త  ప్రదేశాలలో ఓ హృదయం అనుభవమయ్యింది,
అవిజ్ఞమైన లోతుల్లోని శోకం వమ్మయ్యింది;
ఆమె అమర దరహాసంలో యాతన కరిగిపోయింది.
ఎక్కడో పుట్టిన జీవనం ఇక్కడ చావుపై విజేతగా ఎదిగింది;
పొరబడడం ఇప్పుడు మనసు సహజ లక్షణం కాదు;
అంతా ప్రకాశం, ప్రేమలు అలరారే చోట తప్పిదం పాదం మోపలేదు.
రూపం, అరూపం ఆమెలో ఏకం అయ్యాయి:
ఒక్క దృక్కుతో బృహత్తు అధిగమించబడింది,
కిక్కిరిసిన అనంతాన్ని ఓ ముఖం ప్రస్ఫుటం చేసింది.
అంధమైన విశ్వశక్తులు అన్వేషించే ఆనందాన్ని,
అవర్ణనీయంగా అంగాంగాలలో అవతరింపజేస్తూ
ఆమె అతిసుందర దేహం ఆనంద సాగరాలలో మైమరచిపోయింది.
జన్మకి, కృషికి, విధికి మూలంలో ఆమె నిలిచి వుంది,
మందంగా కదిలే యుగచక్రాలు ఆమె పిలుపు కోసం ఎదురు చూస్తాయి;
కాలం యొక్క రాకాసి పునాదిని కేవలం ఆమె చేతులే మార్చగలవు.
రాత్రి దాచే ప్రగాఢ రహస్యం ఆమెదే;
ఆత్మ యొక్క అద్భుత రూపాంతరకారక శక్తి ఆమెదే;
ఆమె ఓ బంగరు వంతెన, ఓ అద్భుత జ్వాల.
(ఇంకా వుంది)

No comments:

Post a Comment