శ్రీ అరొబిందో
వ్రాసిన మహాకావ్యం “సావిత్రి”.
దీన్ని గతంలో
ఎంతో కవులు మంది తెలుగులోకి అనువదించారు. ఆ స్థాయిలో అనువదించడం అంత సులభం కాదు.
కాని సావిత్రి
కావ్యన్ని చదువుకున్నా, అనువదించినా కలిగే ఆనందం చెప్పనలవి కాదు.
సావిత్రి కావ్యంలో ‘Adoration of the Divine Mother’ అనే
పర్వానికి/అధ్యాయనికి తెలుగు అనువాదం కొన్ని పోస్ట్ లలో పోస్ట్ చేద్దామని ఉద్దేశం…
From Sri
Aurobindo’s ‘Savitri’. Canto II: “Adoration of the Divine Mother”
Even
while he stood on being’s naked edge
And
all the passion and seeking of his soul
Faced
their extinction in some featureless Vast,
The
Presence he yearned for suddenly drew close.
Across
the silence of the ultimate Calm,
Out
of a marvellous Transcendence’ core,
A
body of wonder and translucency
As
if a sweet mystic summary of her self
Escaping
into the original Bliss
Had
come enlarged out of eternity,
Someone
came infinite and absolute.
A
being of wisdom, power and delight,
Even
as a mother draws her child to her arms,
Took
to her breast Nature and world and soul.
Abolishing
the signless emptiness,
Breaking
the vacancy and voiceless hush,
Piercing
the limitless Unknowable,
Into
the liberty of the motionless depths
A
beautiful and felicitous lustre stole.
The
Power, the Light, the Bliss no word can speak
Imaged
itself in a surprising beam
And
built a golden passage to his heart
Touching
through him all longing sentient things.
A
moment’s sweetness of the All-Beautiful
Cancelled
the vanity of the cosmic whirl.
A
Nature throbbing with a Heart divine
Was
felt in the unconscious universe;
It
made the breath a happy mystery.
A
love that bore the cross of pain with joy
Eudaemonised the sorrow
of the world,
Made happy the weight
of long unending Time,
The
secret caught of God’s felicity.
Affirming
in life a hidden ecstasy
It
held the spirit to its miraculous course;
Carrying
immortal values to the hours
It
justified the labour of the suns.
For
one was there supreme behind the God.
A
Mother Might brooded upon the world;
A
Consciousness revealed its marvellous front
Transcending
all that is, denying none:
Imperishable
above our fallen heads
He
felt a rapturous and unstumbling Force.
The
undying Truth appeared, the enduring Power
Of
all that here is made and then destroyed,
The
Mother of all godheads and all strengths
Who,
mediatrix, binds earth to the Supreme.
(pp
312-313)
జగజ్జనని ఆరాధన
ఉనికి చివరి
అంచున అతడు నిలిచి వున్న తరుణంలో
అతడి ఆత్మలోని
తపన, శోధన అంతా
ఏదో నిర్వికార
బృహత్తులో లయం కాజొచ్చిన క్షణంలో,
అతడు పరితపించిన
సన్నిధి ఉన్నట్లుండి సన్నిహితమయ్యింది.
చరమ నైశ్చ్యల్యపు
నిశ్శబ్దానికి ఆవల,
బ్రహ్మాండమైన
అతీతత్వపు సారం లోనుండి,
ఓ అద్భుత విరాజమాన
దేహం,
ఆమె ఆత్మ యొక్క
మధుర మహత్తర సారాంశంలా
ఏదో ప్రప్రథమ
ఆనందంతో విలీనం అవుతూ
శాశ్వతత్వం నుండి
పెల్లుబికి సాక్షాత్కరించింది,
అనంతమై, అనపేక్షమై
ఎవరో దిగివచ్చారు.
ప్రజ్ఞ, ప్రాబల్యం,
ప్రహ్లాదాలు మూర్తీభవించిన ఓ జీవి,
తల్లి తన బిడ్డని
అక్కున జేర్చుకున్నట్లు,
ప్రకృతిని, ప్రపంచాన్ని,
ఆత్మని తన ఒడి జేర్చుకుంది.
చిన్నెలు లేని
శూన్యాన్ని రద్దు చేస్తూ,
రిక్తతని, నిస్వనమైన
మౌనాన్ని భంగపరుస్తూ,
హద్దుల్లేని
అజ్ఞేయాన్ని భేదిస్తూ,
చలన రహిత లోతుల్లోకి
చొరబడింది
ఓ సుందర, సుఖమయ
ప్రకాశం.
మాటకి అందని
ఆ శక్తి, కాంతి, ఆనందం
ఓ ఆశ్చర్యకర
కిరణరాశిగా పోతపోసుకుని
అతడి హృదయంలోకి
ఓ బంగరు బాటను వేసి
అతడి ద్వారా
ఆర్తిగొన్న జీవరాశి సమస్తాన్ని స్పృశించింది.
ఆ సర్వ సౌందర్యపు
క్షణమాత్రపు తీయదనం
విశ్వభ్రమణం
యొక్క అర్థరాహిత్యాన్ని వమ్ముచేసింది.
అచేతన విశాల
విశ్వంలో
దివ్య హృదయంతో
స్పందించే ప్రకృతి అనుభవమయ్యింది;
దాని వల్ల ఊపిరి
ఓ సంతోషకర రహస్యం అయ్యింది.
యాతనా శిలువని
ఆనందంగా భరించే ప్రేమ
లోకంలోని శోకాన్ని
శ్రేయోపేతంగా మార్చి,
అంతులేని కాలభారాన్ని
సుతోషితం గావించి,
భగవదానంద రహస్యాన్ని
వశం చేసుకుంది.
జీవితంలో దాగిన
ఓ గుప్త పారవశ్యాన్ని సమర్ధిస్తూ
ఆత్మని దాని
మహత్తర మార్గంలో నిలిపింది;
అమర విలువలని
ఘడియలలోకి చొప్పిస్తూ
విశ్వప్రయాసలకి
సంజాయిషీ చెప్పింది.
దైవం వెనుక మరి
ఓ పరమం వుంది.
ఓ మాతృశక్తి
ప్రపంచాన్ని కనిపెట్టుకుని వుంది;
అన్నిటికీ అతీతమైనా,
దేనినీ ఒల్లని
ఓ చైతన్యం దాని
అద్భుత ముఖాన్ని వెల్లడి చేసింది:
మన పడిన శిరసులపై
అక్షయమై వెలుగొందే
ఓ తీయని, తొట్రువడని
శక్తిని గుర్తించాడు.
సృజింపబడి, నశింపబడే
దానంతటిలో
సమసిపోక నిలిచే
శక్తి, ఆ మృతిలేని స్ఫుట సత్యం,
సమస్త శక్తులకి,
సురలకి తల్లి,
భూమిని పరమాత్మతో
సంధించే మధ్యవర్తిని.
(ఇంకా వుంది)
No comments:
Post a Comment