Sri Aurobindo and the Mother

Sri Aurobindo and the Mother

Wednesday, December 11, 2013

శ్రీ అరొబిందో: సూక్తులు - సుభాషితాలు (11-20)



11. My soul knows that it is immortal. But you take a dead body to pieces and cry triumphantly “Where is your soul and where is your immortality?”

11.  నా ఆత్మకి తాను చిరంజీవి అని తెలుసు. మరి నువ్వేమో ఒక మృత కళేబరాన్ని ముక్కలుగా కోసి ‘ఏదీ నీ ఆత్మ, ఏవయ్యింది నీ అమృతత్వం?’ అంటూ విర్రవీగుతావు.


12. Immortality is not the survival of the mental personality after death, though that also is true, but thewaking possession of the unborn & deathless self of which body is only an instrument
and a shadow.

12.  మరణానంతరం మనోమయ వ్యక్తి జీవించి ఉండడం కాదు అమృతత్వం అంటే. అయితే అందులోనూ కొంత నిజం లేకపోలేదు. జననమరణ రహితమై దేహాన్ని ఒక పనిముట్టుగా స్వీకరించి, ఒక ముసుగుగా ధరించిన ఆత్మను పొందడమే అసలైన అమృతత్వం.


13. They proved to me by convincing reasons that God did not exist, and I believed them. Afterwards I saw God, for He came and embraced me. And now which am I to believe, the
reasonings of others or my own experience?


13. దేవుడనే వాడు లేడని గట్టి వాదనలు చేసి నిరూపించారు. అటు పిమ్మట నాకు భగవద్దర్శనం కలిగింది. ఆయనే వచ్చి నన్ను అక్కున జేర్చుకున్నాడు. మరిప్పుడు నేను దేనిని నమ్మను – వారి వాదనా పటిమనా, నా స్వీయానుభూతినా?


14. They told me, “These things are hallucinations.” I inquired what was a hallucination and found that it meant a subjective or a psychical experience which corresponds to no objective or
no physical reality. Then I sat and wondered at the miracles of the human reason.

14.  ‘ఇదంతా భ్రాంతి’ అంటూ బోధలు చేశారు. అప్పుడు భ్రాంతికి అర్థం ఏమిటో శోధించగా అది ఏ విధమైన విషయాశ్రయ, భౌతిక వాస్తవంతోను సంబంధం లేని అంతరంగ, ఆత్మగత అనుభూతి అని గ్రహించాను. మానవ వివేచన చేసే వింతలు చూసి అబ్బురపడ్డాను.


15. Hallucination is the term of Science for those irregular glimpses we still have of truths shut out from us by our preoccupation with matter; coincidence for the curious touches of artistry in the work of that supreme & universal Intelligence which in its conscious being as on a canvas has planned & executed the world.

15.  భౌతిక ప్రపంచంలో మన మనసులు లగ్నమై ఉండడం చేత ఏ సత్యాలైతే మన దృష్టికి ఆనకుండా ఉంటాయో, ఆ సత్యల యొక్క అసంకల్పిత క్షణకాల దర్శనాలే విజ్ఞాన శాస్త్ర పరిభాషలో భ్రాంతులు అవుతాయి. ఆత్మ అనే నేపథ్యం మీద, విశ్వ ప్రజ్ఞ అనే చిత్రకారుడు, లోకపాలన అనే చిత్తరువును చిత్రిస్తూ, విసరిన కుంచె విసురులే కాకతాళియ సంఘటనలుగా పరిగణింపబడతాయి.


16. That which men term a hallucination is the reflection in the mind & senses of that which is beyond our ordinary mental & sensory perceptions. Superstition arises from the mind's wrong understanding of these reflections. There is no other hallucination.


16.  మన సాధారణ మనోదృష్టికి, ఇంద్రియ సంవేదనలకు అతీతమైన దాని యొక్క ప్రతిబింబం మనసు, ఇంద్రియాలలో కనిపించినపుడు, దాన్ని మనుషులు భ్రాంతి అంటారు. మనస్సు ఈ ప్రతిబింబాలని తప్పుగా అర్థం చేసుకున్నప్పుడే మూఢనమ్మకాలు బయల్దేరుతాయి. ఇది తప్ప ఇక వేరే భ్రాంతి అనేదే లేదు.


17. Do not, like so many modern disputants, smother thought under polysyllables or charm inquiry to sleep by the spell of formulas and cant words. Search always; ®nd out the reason
for things which seem to the hasty glance to be mere chance or illusion.


17. ఆధునిక తార్కికులకి మల్లె భారపదజాలం అడుగున భావాన్ని పూడ్చివేయకు, అరిగిన పదాలతో, అర్థం లేని సూత్రాలతో విచారణని నిద్రపుచ్చకు. సదా శోధించు. మొదటి చూపులో కేవలం కాకతాళీయంగానో, భ్రమగానో తోచిన విషయాల వెనుక కారణాలను అన్వేషించు.


18. Someone was laying it down that God must be this or that or He would not be God. But it seemed to me that I can only know what God is and I do not see how I can tell Him what He
ought to be. For what is the standard by which we can judge Him? These judgments are the follies of our egoism.

18. దేవుడంటే ఇలా వుండాలని లేకుంటే అసలు అతడు దేవుడే కాడని ఎవరో తేల్చి చెప్పగా విన్నాను. నా వరకు అయితే భగవంతుడు ఎలా ఉంటాడో కేవలం తెలుసుకోగలను. ఆయనని ఇలా ఉండమని శాసించడానికి నేనెవడను? ఆయనను కొలవడానికి మన వద్ద ప్రమాణమేది? ఇటువంటి తీర్పులన్నీ అహంకారం చేసే పొరబాట్లు మాత్రమే.


19. Chance is not in this universe; the idea of illusion is itself an illusion. There was never illusion yet in the human mind that was not the concealing and disfigurement of a truth.


19. అసలు ఈ విశ్వంలో యాదృచ్ఛికత అనేదే లేదు. భ్రమ అనేది ఉన్నదన్న భావనే ఒక భ్రమ. ఏదో ఒక సత్యాన్ని మరుగు పరుస్తూ, దాని వికార రూపం కాని భ్రమ ఇంతవరకు మనిషి మనసులో మెదలలేదు.


20. When I had the dividing reason, I shrank from many things; after I had lost it in sight, I hunted through the world for the ugly and the repellent, but I could no longer find them.


20. విభేదాలు కల్పించే వివేచన ఉన్నంత కాలం ఎన్నో విషయాల పట్ల నాలో జుగుప్స ఉండేది. కాని ఆ ధోరణి నా దృష్టి నుండి దూరమైనపుడు అసహ్యమైన, జుగుప్సాకరమైన వాటి కోసం లోకమంతా గాలించినా అవి ఎక్కడా తారసపడలేదు.

No comments:

Post a Comment