This
was a seed cast into endless Time.
A
Word is spoken or a Light is shown,
A
moment sees, the ages toil to express.
So
flashing out of the Timeless leaped the worlds;
An
eternal instant is the cause of the years.
All
he had done was to prepare a field;
His
small beginnings asked for a mighty end:
For
all that he had been must now new-shape
In
him her joy to embody, to enshrine
Her
beauty and greatness in his house of life.
But
now his being was too wide for self;
His
heart’s demand had grown immeasurable:
His
single freedom could not satisfy,
Her
light, her bliss he asked for earth and men.
But
vain are human power and human love
To
break earth’s seal of ignorance and death;
His
nature’s might seemed now an infant’s grasp;
Heaven
is too high for outstretched hands to seize.
This
Light comes not by struggle or by thought;
In
the mind’s silence the Transcendent acts
And
the hushed heart hears the unuttered Word.
A
vast surrender was his only strength.
A Power that lives upon
the heights must act,
Bring
into life’s closed room the Immortal’s air
And
fill the finite with the Infinite.
All
that denies must be torn out and slain
And
crushed the many longings for whose sake
We lose
the One for whom our lives were made.
Now
other claims had hushed in him their cry:
Only
he longed to draw her presence and power
Into
his heart and mind and breathing frame;
Only
he yearned to call for ever down
Her
healing touch of love and truth and joy
Into
the darkness of the suffering world.
His soul was freed and
given to her alone.
అంతులేని కాలంలో
నాటబడ్డ బీజం ఇది.
ఒక వాణి పలికింది,
ఒక కాంతి వెల్లడి అయ్యింది,
క్షణాలు దర్శించిన
దాన్ని, యుగాలు శ్రమించి వ్యక్తం చేస్తాయి.
కాలాతీతం నుండి
మెరుపుల్లా పెల్లుబికాయి ప్రపంచాలు;
ఓ నిత్య తరుణం
సంవత్సరాలకి కారణభూతం అయ్యింది.
అతడు చేసిన దల్లా
క్షేత్రాన్ని సిద్ధం చెయ్యడమే;
అతడి స్వల్ప
తొలి యత్నాలు ఘనమైన ముగింపును కోరాయి:
అతడి గతమంతా
ఇప్పుడు నవ్యంగా రూపొందాలి
ఆమె ఆనందాన్ని
తనలో పోతపోసుకోవాలని,
ఆమె అందానికి,
మహత్తుకు తన జీవనాలయంలో గుడికట్టాలని.
కాని ఇప్పుడు
అతడి వ్యక్తి ఆత్మ కన్నా విశాలం అయ్యింది;
అతడి హృదయం లోని
ఆకాంక్ష అమాంతంగా పెరిగిపోయింది:
ఏకాంత స్వేచ్ఛ
అతడికి సంతృప్తి నీయలేకపోయింది,
భూమి కోసం, మనుషుల
కోసం ఆమె తేజాన్ని, ఆనందాన్ని కోరుకున్నాడు.
కాని అజ్ఞానంతో,
మృత్యువుతో కూడుకున్న భూమి పాశాన్ని తెంచేందుకు
మానవ శక్తి,
మానవ ప్రేమ నిష్ప్రయోజకాలు;
అతడి ప్రకృతి
యొక్క శక్తి ఓ పసికందు సత్తా వంటిది;
అల్లార్చే చేతులకి
అందనంత ఎత్తులో వుంది స్వర్గం.
ప్రయత్నం వల్ల,
ఆలోచన వల్ల దిగి వచ్చే కాంతి కాదిది;
మనస్సు యొక్క
మౌనంలో పరమం పని చేస్తుంది
సద్దుమణిగిన
హృదయం పలుకని పదాన్ని వింటుంది.
ఓ విశాల సమర్పణే
అతడి ఏకైక బలం.
ఎత్తులలో జీవించే
ఓ శక్తి పని చెయ్యాలి,
జీవితపు మూసిన
గదిలో అమర్త్యుడి గాలిని ప్రవేశపెట్టి
మితాన్ని అమితంతో
పూరించాలి.
నిరాకరించే దానంతటినీ
పెల్లగించాలి, హతమార్చాలి
ఏ అనన్యుడి కోసం
అయితే మన జీవితాలు ఏర్పడ్డాయో
అతడి ప్రాప్తికి
అడ్డుపడే మన పలు తపనలని అణగదొక్కాలి.
అతడిలోని ఇతర
ఆశల ఆక్రందన లన్నీ సద్దుమణిగాయి:
తన హృదయంలోకి,
మనస్సు లోకి, నిశ్వసించే దేహం లోకి
ఆమె సన్నిధిని,
శక్తిని ఆకర్షించాలని మాత్రమే తపించాడు;
ఈ యాతనామయ ప్రపంచం
యొక్క అంధకారం లోకి
ప్రేమ, సత్యం,
ఆనందాల ఆమె మధుర స్పర్శ
దిగి వచ్చేలా
చెయ్యాలని మాత్రమే పరితపించాడు.
అతడి ఆత్మ విడుదల
పొంది, ఆమెకు మాత్రమే సమర్పించబడింది.
(End of the
Canto Two – “Adoration of the Divine Mother”)
No comments:
Post a Comment