Sri Aurobindo and the Mother

Sri Aurobindo and the Mother

Sunday, December 22, 2013

సూక్తులు - సుభాషితాలు (51-60)




51. To hate the sinner is the worst sin, for it is hating God; yet he who commits it, glories in his superior virtue.
51.  పాపిని అసహ్యించుకోవడమే అతి ఘోరమైన పాపం. ఎందుకంటే అది భగవంతుణ్ణి అసహ్యించుకోవడమే. అయినా కూడా అది చేసేవాడు తన ఉన్నతిని తానే ప్రశంసించుకుంటున్నాడు.

52.  When I hear of a righteous wrath, I wonder at man's capacity for self-deception.
52. ధర్మబద్ధమైన ఆగ్రహం గురించి విన్నప్పుడు మనుషుల ఆత్మవంచనా శక్తి ఎంత గొప్పదో తెలుసుకున్నాను.

53. This is a miracle that men can love God, yet fail to love humanity. With whom are they in love then?

53. అత్యద్భుతమైన విషయం ఏంటంటే మనుషులు దేవుణ్ణి ప్రేమించగలరు గాని సాటి మానవుణ్ణి ప్రేమించలేక పోతారు. మరి ఇంతకీ వాళ్లు ఎవరిని ప్రేమిస్తున్నట్టు?



54. The quarrels of religious sects are like the disputing of pots, which shall be alone allowed to hold the immortalizing nectar. Let them dispute, but the thing for us is to get at the nectar in whatever pot and attain immortality.

54. వివిధ మతాల మధ్య స్పర్థలు, తమలో అమృతత్వాన్ని పూర్తిగా ఎవరు నింపుకొవాలా అని కలహించుకునే కుండల రీతిలో ఉంటాయి. వారిని కలహించుకోనీ. మనకి కావలసినది అమృతం ఏ కుండలో ఉన్నా గ్రహించి అమృతత్వాన్ని పొందడం.


55. You say that the flavour of the pot alters the liquor. That is taste; but what can deprive it of its immortalising faculty?

55. కుండ రుచి అమృతానికి అంటుతుంది అంటావు. అది రుచి మాత్రమే. దాని అమృతత్వపు గుణం ఎక్కడికి పోతుంది?

56. Be wide in me, O Varuna; be mighty in me, O Indra; O Sun, be very bright and luminous; O Moon, be full of charm and sweetness. Be ®erce and terrible, O Rudra; be impetuous and
swift, O Maruts; be strong and bold, O Aryama; be voluptuous and pleasurable, O Bhaga; be tender and kind and loving and passionate, O Mitra. Be bright and revealing,O Dawn; ONight,
be solemn and pregnant. O Life, be full, ready & buoyant; O Death, lead my steps from mansion to mansion. Harmonise all these, O Brahmanaspati. Let me not be subject to these gods, O
Kali.
56.  ఓ వరుణుడా! నాలో విశాలంగా కొలువుండు; ఓ ఇంద్రుడా! నాలో సర్వసమర్ధుడవై నిలువు; ఓ సూర్యుడా! తీక్షణమైన తేజంతో ప్రకాశించు; ఓ చంద్రుడా! తేనె వంటి అందాన్ని చిలికించు; ఓ రుద్రుడా! ఉగ్రుడవై భయంకరుడవగుc; ఓ మరుద్గణములారా! ప్రచండ వేగంతో విహరించండి; ఓ ఆర్యముడా! ధీరుడవై, బలవంతుడవై విలసిల్లు; ఓ భగుడా! ప్రీతిపూర్ణుడవై హ్లాదాన్ని ప్రసాదించు; ఓ మిత్రుడా! దయతో, కరుణతో, ప్రేమాతిశయంతో రాజిల్లు; ఓ ఉషాదేవీ! పూర్ణతేజంతో సర్వాన్నీ ప్రస్ఫుటం చేయి; ఓ రేయీ! నీరవమై గంభీరవై ఉండు; ఓ ప్రాణమా! నిండుగా, సంసిద్ధంగా ఉప్పొంగు; ఓ మృత్యువా! ఒక నివాసం నుండి మరో నివాసానికి నన్ను నడిపించు; ఓ బ్రాహ్మణస్పతీ! వీటన్నిటినీ సామరస్యపరుచు. ఓ కాళీ! ఈ దేవతలకు  అధీనుడను కాకుండా నన్ను కాపాడు.

57. When, O eager disputant, thou hast prevailed in a debate, then art thou greatly to be pitied; for thou hast lost a chance of widening knowledge.

57. ఓ వాదనాపరాయణుడా! వాదనలో నువ్వు ఎపుడైనా నెగ్గినపుడు నిన్ను చూసి ఎంతో జాలి పడాలి. నీ జ్ఞానాన్ని విస్తరింపజేసుకునే ఒక సదవకాశాన్ని పోగొట్టుకున్నావు.

58. Because the tiger acts according to his nature and knows not anything else, therefore he is divine and there is no evil in him. If he questioned himself, then he would be a criminal.

58. పులికి తన స్వభావానికి తగినట్టు ప్రవర్తించడం తప మరొకటి తెలియదు కనుక, తన చేష్టలలో దుష్టత్వం లోపించి దివ్యంగా ఉంటాయి. కాని తన చేష్టలను తాను ప్రశ్నించుకున్నదంటే అది హంతకుడే అవుతుంది.

59. The animal, before he is corrupted, has not yet eaten of the tree of the knowledge of good and evil; the god has abandoned it for the tree of eternal life; man stands between the upper heaven and the lower nature.

59. నిష్కళంకమై ఉన్న పశువు, ధర్మాధర్మ విచక్షణ నందించే వృక్షఫలాన్ని ఎన్నడూ తిని ఎరుగదు; దేవతలు ఆ వృక్షాన్ని విడిచి సనాతన జీవనాన్ని ప్రసాదించే తరువును ఎన్నుకున్నారు; ఆ పై లోకానికి ఈ అధఃప్రకృతికి మధన నిలిచి వున్నాడు మానవుడు.



60. One of the greatest comforts of religion is that you can get hold of God sometimes and give him a satisfactory beating. People mock at the folly of savages who beat their gods when
their prayers are not answered; but it is the mockers who are the fools and the savages.

60. మతం మనిషికి ఇచ్చే గొప్ప సౌఖ్యం ఏమిటంటే కొన్ని సార్లు కోపం వచ్చినప్పుడు దేవుణ్ణి చేతబుచ్చుకుని మనసార దండించుకోవచ్చు. తమ ప్రార్థనలు ఆలకించని దేవుళ్లని దండించే అనాగరికులని చూసి కొందరు నవ్వుకుందురుగాక. కాని ఆ నవ్వేవారే మూర్ఖులు, వెక్కిరించేవారే అనాగరికులు.

Friday, December 20, 2013

సూక్తులు-సుభాషితాలు (41-50)



41. There are four very great events in history, the siege of Troy, the life and crucifixion of Christ, the exile of Krishna in Brindavun and the colloquy with Arjuna on the field of Kurukshetra.
The siege of Troy created Hellas, the exile in Brindavun created devotional religion, (for before there was only meditation and worship,) Christ from his cross humanised Europe, the colloquy at Kurukshetra will yet liberate humanity. Yet it is said that none of these four events ever happened

41. చరిత్రలో నాలుగు అతిగొప్ప సంఘటనలు ఉన్నాయి. అవి ట్రాయ్ నగర ఆక్రమణం, క్రీస్తు పుట్టుక, శూలోరోపణం, బృందావనం లో శ్రీకృష్ణుడి అజ్ఞాత వాసము, కురుక్షేత్రంలో కృష్ణార్జునుల సంవాదము. ట్రాయ్ ఆక్రమణంతో హెల్లాస్ పుట్టింది, బృందావనంలో అజ్ఞాతవాసం భక్తి సాంప్రదాయానికి పునాది వేసింది (అంతకు మునుపు ధ్యాన, అర్చనా పధతులే ఉండేవి.) శిలువ నుండి క్రీస్తు యూరప్ కి మానవత్వం ప్రసాదించాడు. కురుక్షేత్రంలో సంవాదం మానవతకి మోక్షమార్గాన్ని తెలిపింది. అయినా ఈ నాలుగు సంఘటనలు చరిత్రలో ఎప్పుడు జరగలేదనే అంటారు.

42. They say that the Gospels are forgeries and Krishna a creation of the poets. Thank God then for the forgeries and bow down before the creators.

42.  క్రైస్తవ ప్రవచనాలన్నీ కల్పితాలని, కృష్ణుడు కవితా సృష్టి అని అంటారు. అదే నిజమైతే ఆ కల్పితాలకి ధన్యవాదాలు, ఆ కవులకి నమోవాకాలు.


43. If God assigns to me my place in Hell, I do not know why I should aspire to Heaven. He knows best what is for my welfare.

43.  భగవంతుడు నాకు నరకంలో స్థానాన్ని నియమిస్తే నేను స్వర్గం కోసం ఎందుకు ఆకాంక్షించాలి? నాకు ఏది కావాలో ఆయనకి బాగా తెలుసు.


44. If God draw me towards Heaven, then, even if His other hand strive to keep me in Hell, yet must I struggle upward.

44.  భగవంతుడు నన్ను స్వర్గం వైపుకి లాగుతున్నప్పుడు, మరో చేతితో నన్ను నరకంలో నొక్కి పట్టినా, నేను పైకి ఎగయడానికే కృషి చేస్తాను.


45. Only those thoughts are true the opposite of which is also true in its own time and application; indisputable dogmas are the most dangerous kind of falsehoods.

45.  ఏ భావాల యొక్క వ్యతిరేక భావాలు కూడా కాలాన్ని బట్టి, ప్రయోజనాన్ని బట్టి సత్యాలుగా స్వీకృతం అవుతాయో, ఆ భావాలే నిజమైన భావాలు. శోధనకు తావీయని పిడివాదాలే అన్నిటికన్నా ప్రమాదకరమైన అసత్యాలు.


46. Logic is the worst enemy of Truth, as self-righteousness is the worst enemy of virtue; for the one cannot see its own errors nor the other its own imperfections.

46. తర్కం సత్యానికి పరమ విరోధి. అట్లాగే ఆత్మసమర్ధన  సుగుణానికి పరమ విరోధి. ఒకటి తన లోపాలను తాను గుర్తించలేదు. మరొకటి తన అపరిపూర్ణతలని తాను గుర్తించలేదు.


47. When I was asleep in the Ignorance, I came to a place of meditation full of holy men and I found their company wearisome and the place a prison; when I awoke, God took me to a prison and turned it into a place of meditation and His trysting-ground.

47. నేను అజ్ఞానంలో నిదురిస్తున్న దశలో ఒకసారి ఎందరో సాధువులు ధ్యానం చేస్తున్న ప్రదేశానికి వెళ్లాను. వారి సాంగత్యం నాకు దుర్భరంగాను, ఆ ప్రదేశం ఒక కారాగారం లాగాను తోచింది. నేను మేలుకున్న తరువాత భగవంతుడు నన్నొక కారాగారంలో ఉంచి దానినే ఒక ధ్యానవాటికగా, ఆయన సంగమస్థానంగా మార్చాడు.


48. When I read a wearisome book through and with pleasure, yet perceived all the perfection of its wearisomeness, then I knew that my mind was conquered.

48. ఒక నిస్సారమైన పుస్తకాన్ని సాంతం ప్రీతితో చదివి, దాని నిస్సారత యొక్క పరిపూర్ణతను సంపూర్ణంగా గుర్తించిననాడు,  నా మనస్సు జయించబడిందని గ్రహించాను.


49. I knew my mind to be conquered when it admired the beauty of the hideous, yet felt perfectly why other men shrank back or hated.

49. అనాకారి సౌందర్యాన్ని ఆరాధిస్తూ, ఆ రూపాన్ని అన్యులెందుకు అసహ్యించుకుంటారో సంపూర్ణంగా అనుభూతి చెందగల్గినప్పుడు, నా మనస్సు జయించబడిందని గ్రహించాను.

 

50. To feel  and love the God of beauty and good in the ugly and the evil, and still yearn in utter love to heal it of its ugliness and its evil, this is real virtue and morality.

50. కురూపంలో, దుష్టత్వంలో కూడా ఆ నిత్యసుందరుణ్ణి, పరమపావనుణ్ణి గుర్తించి ప్రేమిస్తూ, అంతటితో ఆగక ఆ కురూప దుష్టత్వాలు నయం కావాలని ప్రేమతో ఆకాంక్షించడమే నిజమైన సద్గుణం, అసలైన సదాచారం.

Wednesday, December 18, 2013

వైదిక సిద్ధాంతం – సింహావలోకనం

అధ్యాయం – 2
వైదిక సిద్ధాంతం – సింహావలోకనం

మన బుద్ధిగత, చింతనా సాంప్రదాయాలకి పూర్వయుగానికి చెందిన  సృష్టి వేదం. ఆ ఆదిమ యుగంలో ఆలోచన మన తార్కిక హేతువు కన్నా భిన్నమైన గతులని అనుసరించింది. భాష మన ఆధునిక ప్రమాణాలు అసమ్మతమని భావించే ధోరణులని అలవరచుకుంది. ఆ యుగంలో మానవోత్తములు, సామాన్య మానవ దైనిక వ్యవహారాలకి, ఇంద్రియ వృత్తులకి అతీతమైన జ్ఞాన రంగాలలో ఎప్పుడూ ఆంతరిక అనుభూతి మీదను, లోజ్ఞానపరాయణమైన మనస్సు యొక్క సూచనల మీదను ఆధారపడేవారు. వారి లక్ష్యం ఆత్మప్రకాశనం, తార్కిక నిరూపణం కాదు. వారి ఆదర్శం అంతఃప్రేరణ గల ఋషి, సునిశిత బుద్ధి గల తార్కికుడు కాదు. వేదమూలాలకి సంబంధించిన ఈ సత్యాన్ని భారతీయ సాంప్రదాయం భద్రంగా పదిలపరిచింది. ఋషి అంటే ఋక్కులని కూర్చిన ఓ వ్యక్తి కాడు. ఓ సనాతన సత్యాన్ని, వ్యక్తికి అతీతమైన జ్ఞానాన్ని, దర్శించిన ఓ ద్రష్ట.  వేద భాషని ‘శ్రుతి’ అంటారు. ఋక్కులలోని లయ బుద్ధి కూర్చినది కాదు. అది వినిపించినది. వ్యక్తికి అతీతమైన  జ్ఞానాన్ని అందుకోవడానికి ఆత్మశిక్షణ చేత సంసిద్ధుడైన మానవుడి అంతశ్శ్రవణానికి వినిపించిన, అనంతుడి లోంచి పెల్లుబికిన, ఓ దివ్య ధ్వని. 

ఆత్మప్రకాశనం అన్న వైదిక భావనలో అదేదో మహిమాన్వితమైనది, లోకోత్తరమైనది అన్న భావన ఉండదు. ఆ సామర్థ్యాన్ని అలవరచున్న ఋషి  క్రమబద్ధమైన ఆత్మశిక్షణ ద్వారా ఆ శక్తిని సాధిస్తాడు. జ్ఞానం అంటే ప్రయాణించడం, అందుకోవడం, కనుక్కోవడం, గెలుచుకోవడం. ఆ మార్గాంతంలో కలిగేదే ఆత్మప్రకాశనం. చరమ విజయానికి బహుమతి ఆత్మతేజం. ఈ యాత్ర అనే భావన, సత్యం దిశగా జీవాత్మ సలిపే యాత్ర అన్న భావన, వేదంలో మనకి తరచు ఎదురవుతూ ఉంటుంది. ఆ యాత్రలో జీవాత్మ ముందుకి సాగుతూ  పైపైకి అధిరోహిస్తుంది. దాని ఆకాంక్ష ఫలితంగా కొత్త చైతన్య, తేజో భూమికలు విప్పారుతాయి. ప్రతాపవంతమైన కృషి చేత మరింత విస్తారమైన అధ్యాత్మిక ఐశ్వర్యాన్ని గెలుచుకుంటుంది.

          చారిత్రక దృష్టితో చూసినప్పుడు, మానవజాతి  దాని సమిష్టి పురోగమన పథంలో,  ఒక దశలో సాధించిన ఓ  మహత్తర ప్రగతికి ఆనవాలుగా వేదం గోచరిస్తుంది.  అంతరంగ బహిరంగాలలో జరిగే ఆత్మసమర్పణను  వర్ణించే కర్మకాండమే వేదం. ప్రకృతిగత, పాశవిక మానవుడికి అందని అనుభవైక, భావ భూమికల ఆవిష్కరణని, ఆరోహణని కీర్తిస్తూ, మర్త్యమానవుడిలో పనిచేసే దివ్య తేజాన్ని, శక్తిని, కృపని కొనియాడుతూ  ఆత్మ పాడే విజయగీతికే వేదం.  కనుక అది బుద్ధిగత వృత్తి నుండి, విశృంఖల ఊహాగానం నుండి పుట్టిన ఫలితాల లిఖిత రూపం మాత్రం ససేమిరా కాదు. అందులో ఆదిమ మత శాసనాల ఆనవాళ్లు లేవు. పొందిన అనుభవాలలోని సామాన్యత కారణంగా, అందుకున్న జ్ఞానంలోని వ్యక్తిరాహిత్యం కారణంగా, కొన్ని స్థిర భావాలే వేదంలో పదే పదే ఆవృతమై వస్తుంటాయి. ఆ భావాలు  ఒక స్థిరమైన ప్రతీకాత్మక భాషలో వ్యక్తం అవుతుంటాయి. మరి మానవ భాష యొక్క ఆ ఆదిమ దశలలో అలాంటి భావజాలం యొక్క వినియోగం సహజమేనేమో. ఆ దశలో మానవజాతి యొక్క సామాన్య  మానసానికి అందని తత్వాన్ని వ్యక్తం చెయ్యడానికి అవసరమైన మాంత్రిక  భావప్రకటనా శక్తితో  పాటు కచ్చితమైన నిర్దిష్టత గల అటువంటి భాషాప్రయోగం అనివార్యమేమో. అవే భావాలు పలు ఋక్కులలో పదే పదే ఆవృత్తం అవుతూ, అవే స్థిర శబ్దాలతో, అలంకారాలతో, సమాసాలతో మళ్లీ మళ్లీ కనిపిస్తూ ఉంటాయి. ఆలోచనలో కొత్తదనం కోసం గాని, భాషలో నవ్యత కోసం గాని, కవితలో వన్నెపోని సృజన కోసం గాని పాటుపడుతున్నట్టు కనిపించదు. కవితా లాలిత్యం మీద గాని, వైభవం మీద గాని, సౌందర్యం మీద గాని వేదఋషుల ధ్యాస ఉన్నట్టు అగుపించదు. ఒక విధమైన దివ్యగణిత సూత్రావళి మీద నిర్మితమైన  పవిత్ర ఛందోరూపాన్ని ఆలంబనగా చేసుకుని వేదఋషులు శిష్య, ప్రశిష్యుల అవిచ్ఛిన్న  పారంపర్యానికి సనాతన జ్ఞానాన్ని సుస్థిరంగా బోధిస్తూ వచ్చారు. 

వేద ఋక్కులు తీరుగా ఛందోబద్దమై ఉంటాయి. వాటి ప్రయోగంలో మారని సునిశితత్వం, నైపుణ్యం కనిపిస్తాయి. శైలిలో, కవితా స్వరూపంలో గొప్ప వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. అవి కరుకైన కిరాతులో, అనాగరిక కర్మకారులో చేసిన సృష్టి కావు. ఆత్మాలోకిత ప్రేరణ ప్రోద్బలంగా, గంభీర, సునిర్దేశ్య గమనంలో సృజన చేస్తున్న, సచేతనమైన, పరమోత్కృష్టమైన కళ యొక్క ఉఛ్వాస నిశ్వాసాలు ఆ కవితలు. ఇంత ప్రగాఢ సృష్టి కూడా ఒకే నిశ్చిత పరిధిలోను,  మారని కవితా సామగ్రి తోను కూర్చబడినట్టు కనిపిస్తుంది. ఎందుచేతనంటే ఋషులకి కళాత్మక వ్యక్తీకరణ కేవలం ఒక సాధనం మాత్రమే, ముఖ్య లక్ష్యం కాదు. వారి ప్రధాన ధ్యాస అంతా అత్యంత క్రియాశీలమైన, ప్రయోజనాత్మకమైన (ప్రయోజనాత్మకత అన్న పదానికి సమున్నత అర్థాన్ని తీసుకుంటే) లక్ష్యం మీదే వుంది. ఋక్కుని కూర్చిన ఋషికి ఆ ఋక్కు, తనకి, అన్యులకి కూడా అధ్యాత్మిక పురోగతి సాధించడానికి ఒక మార్గం మాత్రమే. అది అతడి ఆత్మ నుండి ఉదయిస్తుంది. అతడి మనసులో ఓ శక్తి అవుతుంది. అతడి అంతర్జీవన చరిత్రలో ఓ  ప్రధాన, లేక కీలక ఘట్టంలో చేయబడ్డ ఆత్మాభివ్యక్తీకరణకి సాధనం అవుతుంది. తనలోని వేలుపుని వ్యక్తం చెయ్యడంలో అది దొహదం చేస్తుంది. దౌష్ట్యానికి ప్రతీక అయిన వినాశిని నాశనం చెయ్యడంలో సహాయం చేస్తుంది. పరిపూర్ణత కోసం శ్రమించే ఆర్యవీరుడి చేతిలో ఆయుధం అవుతుంది. కొండ వాలు మీద సంచరించే ఆవర్తకుణ్ణి, మార్గమధ్యంలో ఎదుటపడే తోడేలుని, సెలయేళ్ల వద్ద పొంచి వుండే చోరుణ్ణి దునుమాడే దేవేంద్రుడి వజ్రాయుధంలా మెరుపులా పెల్లుబుకుతుంది.

(ఇంకా వుంది)

Friday, December 13, 2013

శ్రీ అరొబిందో: సూక్తులు-సుభాషితాలు (31-40)



31. I saw a child wallowing in the dirt and the same child cleaned by his mother and resplendent, but each time I trembled before his utter purity.

31.  బురదలో పొర్లాడుతున్న పసిబిడ్డని చూశాను. అదే బిడ్డను తన తల్లి ముస్తాబు చేసి మురిసిపోగా మెరిసిపోవడమూ చూశాను. ఈ రెండు సందర్భాలలోను ఆ పసివాడి శుద్ధ నైర్మల్యాన్ని చూసి కదిలిపోయాను.

32. What I wished or thought to be the right thing, does not come about; therefore it is clear that there is no All Wise one who guides the world but only blind Chance or a brute Causality.

32.  నేను మంచిదని నమ్మినది, జరగాలని ఆశించినది జరగలేదు. కనుక నిస్సందేహంగా ఈ లోకం సర్వజ్ఞుడైన పరమాత్ముడి పాలనలో లేదు, కేవలం గ్రుడ్డి యాదృచ్ఛికత, కఠోరమైన కార్యకారణ న్యాయం – ఇవే ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి.

33. The Atheist is God playing at hide & seek with Himself; but is the Theist any other? Well, perhaps; for he has seen the shadow of God and clutched at it.

33.  నాస్తికుడిలో భగవంతుడు తనతో తాను దోబూచులు ఆడుకుంటూ ఉంటాడు. మరి ఇతడికి అస్తికుడికి మధ్య ఏమంత వ్యతాసం ఉందని? బహుశః ఉందేమో. అస్తికుడు భగవంతుడి నీడని పట్టుకుని వేలాడుతుంటాడు.

34. O Thou that lovest, strike! If Thou strike me not now, I shall know that Thou lov'st me not.

34. నాపై నీకు దయ ఉంటే నన్ను దండించు ప్రభూ! ఇప్పుడు నన్ను దండించకుంటే నాపై దయ లేదనే అనుకుంటాను.
35. O Misfortune, blessed be thou; for through thee I have seen the face of my Lover.

35. ఓ దురదృష్టమా! నీకు నమస్కరిస్తున్నాను. నీ కారణం చేతనే నా ప్రియతముడు ముఖాన్ని దర్శించుకోగలిగాను.

36. Men are still in love with grief; when they see one who is too high for grief or joy, they curse him & cry, “O thou insensible!” Therefore Christ still hangs on the cross in Jerusalem.

36. మనుషులకి దుఃఖమంటే ఎందుకో మమకారం. సుఖదుఃఖాలకి అతీతుడైన వాడెవడైనా కనిపిస్తే “ఓరీ! నీది రాతి గుండె” అని ఆడిపోసుకుంటారు. అందుకే జెరూసలెమ్ లో క్రీస్తు ఇంకా సిలువ మీదే ఉన్నాడు.

37. Men are in love with sin; when they see one who is too high for vice or virtue, they curse him & cry, “O thou breaker of bonds, thou wicked and immoral one!” Therefore Srikrishna
does not live as yet in Brindavun.
37.  మనుషులకి దుఃఖమంటే ఎందుకో మమకారం. పాపపుణ్యాలకి అతీతుడైన వాడెవడైనా కనిపిస్తే “ఓరీ! సిగ్గుమాలిన వాడా, నీతి నియమాలు లేనివాడా” అంటూ దుయ్యబట్టుతారు. అందుకే కృష్ణుడు నేటికీ బృందావనంలో తప్ప మరెక్కడా మనకి కనిపించడు.

38. Some say Krishna never lived, he is a myth. They mean on earth; for if Brindavun existed nowhere, the Bhagwat could not have been written.

38. కొందరు కృష్ణుడు అనేవాడు పురాణాలలో తప్ప నిజంగా ఎప్పుడూ లేడని అంటారు. వాళ్ల ఉద్దేశం ఈ భూమి మీద జీవించలేదని. ఎందుకంటే బృందావనం అనేది ఎక్కడో లేకుంటే, భాగవతం వ్రాయబడి ఉండేది కాదు.


39. Strange! the Germans have disproved the existence of Christ; yet his crucifixion remains still a greater historic fact than the death of Caesar.

39.  ఎంత విచిత్రం! క్రీస్తు ఉన్కి అబద్ధమని జర్మనులు నిరూపించారు. అయినా క్రీస్తుని సిలువ వెయ్యడమనేది సీజరు మరణం కన్నా ప్రసిద్ధమైన చారిత్రక ఘట్టమయ్యింది.

40. Sometimes one is led to think that only those things really matter which have never happened; for beside them most historic achievements seem almost pale and ineffective.

40. ఒక్కొక్కసారి వాస్తవంలో ఎప్పుడూ జరగని విషయాలే అన్నిటికన్నా ముఖ్యమైనవని అనిపిస్తుంది. వాటి ముందు ఎన్నో చారిత్రక ఘట్టాలు పేలవంగా, నిష్ఫలంగా తోచుతాయి.