Sri Aurobindo and the Mother

Sri Aurobindo and the Mother

Saturday, January 18, 2014

సూక్తులు - సుభాషితాలు (61-70)



61. There is no mortality. It is only the Immortal who can die; the mortal could neither be born nor perish. There is nothing finite. It is only the Infinite who can make for Himself limits; the finite can have no beginning nor end, for the very act of conceiving its beginning & end declares its infinity.

61. అసలు మర్త్య స్థితి అనేదే లేదు. ఒక్క అమృత స్వరూపుడికే మరణం సాధ్యం. మర్త్యమైనది అసలు పుట్టలేదు, నాశనమూ కాలేదు. అట్లాగే మితమైనది ఏదీ లేదు. ఒక్క అనంతుడే తనకు తాను పరిమితాలను ఏర్పరచుకోగలడు. మితానికి మొదలూ ఉండదు, అంతమూ ఉండదు. ఎందుకంటే దాని ఆద్యంతాలని గుర్తించిన మరుక్షణం దాని అనంతత బట్టబయలు అవుతుంది.

62. I heard a fool discoursing utter folly and wondered what God meant by it; then I considered and saw a distorted mask of truth and wisdom.

62. అర్థరహిత ప్రేలాపన కొనసాగిస్తున్న ఒక మూర్ఖుణ్ణి చూసి ఆ  భాషణ జరిపించడంలో భగవంతుడి ఉద్దేశం ఏమిటా అనుకున్నాను. అప్పుడు సూక్ష్మంగా గమనించగా అందులో ముసుగుదేలి వున్న సత్యం, మరుగుపడి వున్న ప్రజ్ఞ వెల్లడి అయ్యాయి.


63. God is great, says the Mahomedan. Yes, He is so great that He can afford to be weak, whenever that too is necessary.

63. దేవుడు ఘనుడు అంటాడు మహ్మదీయుడు. అవును, అతడు ఎంతటి ఘనుడంటే సందర్భం వచ్చినప్పుడు అతి దుర్బలుడిగా కూడా ప్రవర్తించగలడు.

64. God often fails in His workings; it is the sign of His illimitable godhead.

64. భగవంతుడు తన కార్యంలో ఎన్నో సార్లు వైఫల్యాన్ని పొందుతాడు. అనవధికమైన ఆయన దివ్యత్వానికి అది సంకేతం.

65. Because God is invincibly great, He can afford to be weak; because He is immutably pure, He can indulge with impunity in sin; He knows eternally all delight, therefore He tastes also
the delight of pain; He is inalienably wise, therefore He has not debarred Himself from folly.

65.  భగవంతుడు అజేయమైన ఘనత గలవాడు గనుక దీనుడై కూడా మనగలడు; మారని నైర్మల్యం ఉన్నవాడు కనుక పాపర్మ అతణ్ణి కళంక పరచదు; అనాదిగా ఆనందసర్వాన్నీ ఎరిగినవాడు కనుక బాధ అనే ఆనందాన్ని కూడా రుచి చూస్తాడు; సంపూర్ణ జ్ఞాని కనుక పొరబాట్లు చేసే అవకాశాన్ని కూడా  వొదులుకోడు.

66. Sin is that which was once in its place, persisting now it is out of place; there is no other sinfulness.

66. ఒకప్పుడు సందర్భోచితంగా ఉన్నా, ఇప్పుడు అసందర్భమై, అపభ్రంశమైనదే పాపం. అది తప్ప  ఇక వేరే పాపమనేదే లేదు.


67. There is no sin in man, but a great deal of disease, ignorance and misapplication.

67. మనిషిలో పాపం లేదు గాని గంపెడంత అస్వస్థత, అజ్ఞానం, అనుచిత వర్తనం ఉన్నాయి.

68. The sense of sin was necessary in order that man might become disgusted with his own imperfections. It was God's corrective for egoism. Butman's egoism meets God's device by being very dully alive to its own sins and very keenly alive to the sins of others.

68. పాపబీతి అన్నది మనిషిలో తన అపరిపక్వత పట్ల అసహ్యం పుట్టించడానికి అవసరం అయ్యింది. అది అహంకారాన్ని నయం చెయ్యడానికి భగవంతుడు ఏర్పరిచిన విరుగుడు. కాని మనిషిలో అహంకారం తన పాపాలను తగినంతగా గుర్తించుకోక, అన్యుల పాపాలని అతిగా గుర్తిస్తూ భగంవంతుడి ఏర్పాటుని వమ్ము చేస్తోంది.

69. Sin & virtue are a game of resistance we play with God in His efforts to draw us towards perfection. The sense of virtue helps us to cherish our sins in secret.

69. పరిపూర్ణత దిక్కుగా మనను నడిపించే ప్రయాసలో భగవంతుడి కృషిని నిరోధిస్తూ మనం ఆడే ఆటలే పాపపుణ్యాలు. మనం పునీతులం అన్న భావన మన పాపాలని గుప్తంగా దాచుకోవడానికి ఉపయోగపడుతోంది.

70. Examine thyself without pity, then thou wilt be more charitable and pitiful to others.

70. నిర్దయగా నిన్ను నీవు పరీక్షించుకో. అప్పుడు ఇతరుల పట్ల నీవు మరింత జాలి, దయ కలిగి ఉంటావు.

No comments:

Post a Comment