Sri Aurobindo and the Mother

Sri Aurobindo and the Mother

Tuesday, January 28, 2014

సూక్తులు-సుభాషితాలు (71-80)

71. A thought is an arrow shot at the truth; it can hit a point, but not cover the whole target. But the archer is too well satisfied with his success to ask anything farther.
71. సత్యానికి గురి పెట్టి వేసిన బాణమే ఆలోచన. అది ఏదో ఒక బిందువునే ఛేదిస్తుంది గాని లక్ష్యం యావత్తుని ఆక్రమించలేదు. కాని విలుకాడు అంతకు మించి ఆశించక అంతటితో తృప్తిపడతాడు.

72. The sign of dawning Knowledge is to feel that as yet I know little or nothing, & yet, if I could only know my knowledge, I already possess everything.

72. నేటికి నాకు తెలిసినది ఏమీ కాదు అన్న భావన నాలో జ్ఞానాంకురానికి సూచన. అయినప్పటికి నాకున్న జ్ఞానాన్ని నేను సంపూర్ణంగా గ్రహించగలిగితే సర్వమూ నాకు అర్థమైనట్లే.

73. WhenWisdom comes, her ®rst lesson is, “There is no such thing as knowledge; there are only aperËcus of the Infinite Deity.”

73. జ్ఞానం ఉదయించినప్పుడు ఆమె నేర్పే మొదటి పాఠం ఇది – “అసలు జ్ఞానం అనేదే లేదు; ఉన్నదంతా కేవలం అనంత భగవత్తత్వం యొక్క క్షణకాల సందర్శనాలే.”

74. Practical knowledge is a different thing; that is real and serviceable, but it is never complete. Therefore to systematize and codify it is necessary but fatal.
74.  లౌకిక జ్ఞానపు తీరు వేరు. అది వాస్తవమైనది, ఉపయోగితమైనదే కాని ఎన్నటికీ సంపూర్ణం కాలేదు.  క్రమ బద్ధం చేసి, వ్యవస్థీకరించే కృషి అవసరమైనదే, కాని వినాశకరమైనది.

75. Systematise we must, but even in making & holding the system, we should always keep firm hold on this truth that all systems are in their nature transitory and incomplete.

75. వ్యవస్థీకరణ అవసరమే కాని మనం వ్యవస్థను నిర్మించేటప్పుడు వ్యవస్థలన్నీ తాత్కాలికాలే, అసంపూర్ణాలే నన్న సత్యాన్ని స్థిరంగా జ్ఞాపకం పెట్టుకోవాలి.

76. Europe prides herself on her practical and scientific organization and efficiency. I am waiting till her organisation is perfect; then a child shall destroy her.

76. యూరప్ తన శాస్త్రీయ వ్యవస్థను, భౌతిక సమర్థతను చూసుకుని గర్విస్తుంది. ఆ వ్యవస్థ పరిపూర్ణం కావాలని ఎదురుచూస్తున్నా. అప్పుడొక పసివాడు దాన్ని నాశనం చేస్తాడు.

77. Genius discovers a system; average talent stereotypes it till it is shattered by fresh genius. It is dangerous for an army to be led by veterans; for on the other side God may place Napoleon.

77. మేధావి ఒక పద్ధతిని కనుగొంటాడు. మధ్యమైన ప్రతిభ దాన్ని అలవాటుగా అనుకరిస్తుండగా మరో మేధావి వచ్చి దాన్ని భంగం చేస్తాడు. కేవలం అనుభవజ్ఞులైన వృద్ధుల నియంతృత్వంలో ఉండడం సైన్యానికి శ్రేయస్కరం కాడు. ప్రతిపక్షంలో భగవంతుడు నెపోలియన్ ని నియమించి ఉండొచ్చు.

78. When knowledge is fresh in us, then it is invincible; when it is old, it loses its virtue. This is because God moves always forward.

78. మనలో జ్ఞానం స్వచ్ఛంగా, సజీవంగా ఉన్నపుడు అజేయమౌతుంది. పాతబడినప్పుడు శక్తిని కోల్పోతుంది. ఎందుకంటే భగవంతుడు సదా ముందుకి సాగిపోతుంటాడు.

79. God is infinite Possibility. Therefore Truth is never at rest; therefore, also, Error is justified of her children.
79. అనంతావకాశమే భగవంతుడు. కనుకనే సత్యమెప్పుడూ విశ్రమించదు. అందుకే పొరబాటుకి కూడా తన సంతతి కారణంగా ఒక సముచిత స్థానం ఉంటుంది.

80.  కొందరు భక్తజనుల మాటలు వింటున్నప్పుడు భగంవతుడు అసలు నవ్వంటే ఎరగని వాడేమో ననిపిస్తుంది; దేవుడిలో దివ్యమైన అరిస్టోఫేన్స్ వున్నాడన్న హెయిన్స్ ఓ సత్యాన్ని గుర్తించాడు.
80. To listen to some devout people, one would imagine that God never laughs; Heine was nearer the mark when he found in Him the divine Aristophanes.

Saturday, January 18, 2014

సూక్తులు - సుభాషితాలు (61-70)



61. There is no mortality. It is only the Immortal who can die; the mortal could neither be born nor perish. There is nothing finite. It is only the Infinite who can make for Himself limits; the finite can have no beginning nor end, for the very act of conceiving its beginning & end declares its infinity.

61. అసలు మర్త్య స్థితి అనేదే లేదు. ఒక్క అమృత స్వరూపుడికే మరణం సాధ్యం. మర్త్యమైనది అసలు పుట్టలేదు, నాశనమూ కాలేదు. అట్లాగే మితమైనది ఏదీ లేదు. ఒక్క అనంతుడే తనకు తాను పరిమితాలను ఏర్పరచుకోగలడు. మితానికి మొదలూ ఉండదు, అంతమూ ఉండదు. ఎందుకంటే దాని ఆద్యంతాలని గుర్తించిన మరుక్షణం దాని అనంతత బట్టబయలు అవుతుంది.

62. I heard a fool discoursing utter folly and wondered what God meant by it; then I considered and saw a distorted mask of truth and wisdom.

62. అర్థరహిత ప్రేలాపన కొనసాగిస్తున్న ఒక మూర్ఖుణ్ణి చూసి ఆ  భాషణ జరిపించడంలో భగవంతుడి ఉద్దేశం ఏమిటా అనుకున్నాను. అప్పుడు సూక్ష్మంగా గమనించగా అందులో ముసుగుదేలి వున్న సత్యం, మరుగుపడి వున్న ప్రజ్ఞ వెల్లడి అయ్యాయి.


63. God is great, says the Mahomedan. Yes, He is so great that He can afford to be weak, whenever that too is necessary.

63. దేవుడు ఘనుడు అంటాడు మహ్మదీయుడు. అవును, అతడు ఎంతటి ఘనుడంటే సందర్భం వచ్చినప్పుడు అతి దుర్బలుడిగా కూడా ప్రవర్తించగలడు.

64. God often fails in His workings; it is the sign of His illimitable godhead.

64. భగవంతుడు తన కార్యంలో ఎన్నో సార్లు వైఫల్యాన్ని పొందుతాడు. అనవధికమైన ఆయన దివ్యత్వానికి అది సంకేతం.

65. Because God is invincibly great, He can afford to be weak; because He is immutably pure, He can indulge with impunity in sin; He knows eternally all delight, therefore He tastes also
the delight of pain; He is inalienably wise, therefore He has not debarred Himself from folly.

65.  భగవంతుడు అజేయమైన ఘనత గలవాడు గనుక దీనుడై కూడా మనగలడు; మారని నైర్మల్యం ఉన్నవాడు కనుక పాపర్మ అతణ్ణి కళంక పరచదు; అనాదిగా ఆనందసర్వాన్నీ ఎరిగినవాడు కనుక బాధ అనే ఆనందాన్ని కూడా రుచి చూస్తాడు; సంపూర్ణ జ్ఞాని కనుక పొరబాట్లు చేసే అవకాశాన్ని కూడా  వొదులుకోడు.

66. Sin is that which was once in its place, persisting now it is out of place; there is no other sinfulness.

66. ఒకప్పుడు సందర్భోచితంగా ఉన్నా, ఇప్పుడు అసందర్భమై, అపభ్రంశమైనదే పాపం. అది తప్ప  ఇక వేరే పాపమనేదే లేదు.


67. There is no sin in man, but a great deal of disease, ignorance and misapplication.

67. మనిషిలో పాపం లేదు గాని గంపెడంత అస్వస్థత, అజ్ఞానం, అనుచిత వర్తనం ఉన్నాయి.

68. The sense of sin was necessary in order that man might become disgusted with his own imperfections. It was God's corrective for egoism. Butman's egoism meets God's device by being very dully alive to its own sins and very keenly alive to the sins of others.

68. పాపబీతి అన్నది మనిషిలో తన అపరిపక్వత పట్ల అసహ్యం పుట్టించడానికి అవసరం అయ్యింది. అది అహంకారాన్ని నయం చెయ్యడానికి భగవంతుడు ఏర్పరిచిన విరుగుడు. కాని మనిషిలో అహంకారం తన పాపాలను తగినంతగా గుర్తించుకోక, అన్యుల పాపాలని అతిగా గుర్తిస్తూ భగంవంతుడి ఏర్పాటుని వమ్ము చేస్తోంది.

69. Sin & virtue are a game of resistance we play with God in His efforts to draw us towards perfection. The sense of virtue helps us to cherish our sins in secret.

69. పరిపూర్ణత దిక్కుగా మనను నడిపించే ప్రయాసలో భగవంతుడి కృషిని నిరోధిస్తూ మనం ఆడే ఆటలే పాపపుణ్యాలు. మనం పునీతులం అన్న భావన మన పాపాలని గుప్తంగా దాచుకోవడానికి ఉపయోగపడుతోంది.

70. Examine thyself without pity, then thou wilt be more charitable and pitiful to others.

70. నిర్దయగా నిన్ను నీవు పరీక్షించుకో. అప్పుడు ఇతరుల పట్ల నీవు మరింత జాలి, దయ కలిగి ఉంటావు.

Monday, January 13, 2014

వైదిక సిద్ధాంతం - సీంహావలోకనం (3 వ భాగం)



వేద ఋక్కులని, కర్మకాండని ఆరంభంగా తీసుకుని అధ్యాత్మిక చింతన మీద, అనుభవం మీద ఓ కొత్త వ్యాఖ్యానంగా వెలువడ్డ కృతులే బ్రాహ్మణాలు, ఉపనిషత్తులూను. అలా ఆరంభమైన అధ్యాత్మిక పునరుద్దీపనంలో రెండు పరస్పర పరిపూరక అంశాలు ఉన్నాయి. ఒకటి గతానికి చెందిన బాహ్యరూపాల సంరక్షణ. రెండవది వేద సారం యొక్క నవ్య ప్రకటన. ఇందులో మొదటి దానికి బ్రాహ్మణాలు చిహ్నాలు. రెండవ దానికి ఉపనిషత్తులు సంకేతాలు.

వైదిక కర్మకాండకి చెందిన సూక్ష్మాలని, వాటి భౌతిక సాఫల్యానికి కావలసిన నిబంధనలని, అందులోని వివిధ విభాగాల యొక్క, క్రియల యొక్క, ఉపకరణాల యొక్క ప్రయోజనాన్ని, ప్రతీకాత్మక అంతరార్థాన్ని, కర్మకాండకి సంబంధించిన వివిధ మంత్రాల యొక్క ప్రాముఖ్యతని, గతించిన గాధల, సాంప్రదాయాల జ్ఞాపకాలని తిరిగి స్థాపించి, సుస్థిరంగా ప్రతిష్టంచడమే బ్రాహ్మణాల లక్ష్యం. అందులో ప్రస్తావించబడ్డ ఎన్నో గాధలు ఋక్కుల కన్నా పురాతనమైనవని స్పష్టంగా తెలుస్తుంది. అప్పటికే అర్థం కాకుండా పోయిన ఎన్నో విభాగాలని వివరించడం కోసం ఆ గాధలు కల్పించబడ్డాయి. ఇక మరి కొన్ని గాధలు, కథలు ప్రతీకాత్మక పద్ధతిని వాడిన ప్రాచీన కవుల ఉపకరణాలు మాత్రమే కావచ్చు. లేదా ఋక్కులు విరచించబడ్డ కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘట్టాలే కావచ్చు. మౌఖిక సాంప్రదాయంలో జ్ఞానాన్ని ప్రసారం చేసినప్పుడు అందులోని తేజం మరుగుపడే అవకాశం ఎక్కువ. పాత ప్రతీకల స్థానంలో కొత్త ప్రతీకలు వచ్చినప్పుడు, పాత జ్ఞానాన్ని కొత్త ప్రతీకలు కప్పిపుచ్చే ప్రమాదం వుంది. కనుక బ్రాహ్మణాలలో ఎన్నో ఆసక్తికరమైన సూచనలున్నా అందులో మన పరిశోధనకి పనికొచ్చే అంశాలు బహుతక్కువ. వివిధ వేద విభాగాల అంతరార్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో అవి విశ్వసనీయమైన మార్గదర్శకాలు కాలేవు. ఎందుకంటే బ్రాహ్మణాలు వేదాలలోని స్థూలార్థాన్నే నిశితంగా నిర్ధారించే పద్ధతిని అవలంబిస్తాయి. వేదసారాన్ని వెలికి తీయాలంటే అటువంటి పద్ధతి సముచితం కాదు.

ఉపనిషత్తు వ్రాసిన ఋషులు అవలంబించిన పద్ధతి పూర్తిగా వేరు. ధ్యానం చేత, అధ్యాత్మిక అనుభూతి చేత వినష్టమైన జ్ఞానాన్ని తిరిగి సాధించే ప్రయత్నం చేశారు వీళ్లు. వారి సొంత అనుభూతులకి, అంతఃప్రకాశనాలకి వేదమంత్రాలని ఒక ఆధారంగా, ప్రమాణంగా వాడుకున్నారు. వేద శబ్దాన్ని భావబీజంగా వాడుకుని పాత సత్యాలని కొత్త రూపాల్లో పునరావిష్కరించారు. అలా ఆవిష్కరించిన దాన్ని వారు జీవించిన వర్తమాన యుగానికి చెందిన పరిభాషలో వ్యక్తం చేశారు. వేదమంత్రాలతో వారు వ్యవహరించిన తీరులో ఓ ప్రత్యేక వ్యక్తిగత ఉద్దేశం వుంది. ఒక గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్న పండితుడు ఆ గ్రంథంలోని శబ్దాల, వాక్యాల అర్థాన్ని వీలైనంత కచ్చితంగా, నిర్దుష్టంగా స్థాపించాలని పాటుపడతాడు. కాని ఉపనిషత్ రచయితల కాంక్ష అటువంటిది కాదు. వారు అన్వేషిస్తున్నది భాషకి అతీతమైన సత్యం. వారు తపిస్తున్న అంతఃప్రకాశనానికి పదాలు కేవలం సున్నితమైన సూచనలు మాత్రమే. శబ్దం యొక్క వ్యుత్పత్తిని కొన్ని సార్లు విస్మరించేవారు, లేదా కొన్ని సందర్భాలలో సరైన వ్యుత్పత్తి వారికి తెలిసేది కాదు. పదంలోని ఉపశబ్దాల అన్వయంలో వారు వాడిన ప్రతీకాత్మక పద్ధతిని అర్థం చేసుకోవడం, అనుసరించడం సులభం కాదు. ఆ కారణం చేతనే, ఒక పక్క ప్రాచీన ఋషులు స్థాపించిన భావవ్యవస్థ పట్ల, మౌలిక భావనల పట్ల ఉపనిషత్తులు ప్రసరించే కాంతి అమూల్యమైనదే అయినా, మరో పక్క వేదాల యొక్క అసలు అర్థాన్ని ప్రకటించడంలో బ్రాహ్మణాలకు మల్లె ఇవి కూడా అంతగా ఉపకరించలేదు. ఉపనిషత్తుల అసలు ప్రయోజనం వేదాల అన్వయం కాదు, వేదాంతం యొక్క సంస్థాపనం.


 ("వైదిక సిద్ధాంతం - సింహావలోకనం" అనబడే రెండవ అధ్యాయం సమాప్తం)

Friday, January 10, 2014

భగవంతుడు (కవిత) - శ్రీ అరొబిందో



‘God’ – by Sri Aurobindo

Thou who pervadest all the worlds below,
Yet sitst above,
Master of all who work and rule and know,
Servant of Love!
Thou who disdainest not the worm to be
Nor even the clod,
Therefore we know by that humility
That thou art God.

భగవంతుడు
కింద భువనాలన్నీ నిండి వుంటావు
పైన అతీతంగా కొలువుంటావు
ఏలి, ఎరిగి శ్రమించేవారికి స్వామివి
ప్రేమకు నిత్యం బంటువు!
కీటకాన్ని కూడా కాదనవు,
రాతిని కూడా రద్దు చెయ్యవు
ఆ వినతిని చూచి తెలుసుకుంటారు
భగవంతుడివి నువ్వేనని.


Tuesday, January 7, 2014

దివ్యజనని ఆరాధన (ఆఖరి భాగం)



This was a seed cast into endless Time.
A Word is spoken or a Light is shown,
A moment sees, the ages toil to express.
So flashing out of the Timeless leaped the worlds;
An eternal instant is the cause of the years.
All he had done was to prepare a field;
His small beginnings asked for a mighty end:
For all that he had been must now new-shape
In him her joy to embody, to enshrine
Her beauty and greatness in his house of life.
But now his being was too wide for self;
His heart’s demand had grown immeasurable:
His single freedom could not satisfy,
Her light, her bliss he asked for earth and men.
But vain are human power and human love
To break earth’s seal of ignorance and death;
His nature’s might seemed now an infant’s grasp;
Heaven is too high for outstretched hands to seize.
This Light comes not by struggle or by thought;
In the mind’s silence the Transcendent acts
And the hushed heart hears the unuttered Word.
A vast surrender was his only strength.
A Power that lives upon the heights must act,
Bring into life’s closed room the Immortal’s air
And fill the finite with the Infinite.
All that denies must be torn out and slain
And crushed the many longings for whose sake
We lose the One for whom our lives were made.
Now other claims had hushed in him their cry:
Only he longed to draw her presence and power
Into his heart and mind and breathing frame;
Only he yearned to call for ever down
Her healing touch of love and truth and joy
Into the darkness of the suffering world.
His soul was freed and given to her alone.



అంతులేని కాలంలో నాటబడ్డ బీజం ఇది.
ఒక వాణి పలికింది, ఒక కాంతి వెల్లడి అయ్యింది,
క్షణాలు దర్శించిన దాన్ని, యుగాలు శ్రమించి వ్యక్తం చేస్తాయి.
కాలాతీతం నుండి మెరుపుల్లా పెల్లుబికాయి ప్రపంచాలు;
ఓ నిత్య తరుణం సంవత్సరాలకి కారణభూతం అయ్యింది.
అతడు చేసిన దల్లా క్షేత్రాన్ని సిద్ధం చెయ్యడమే;
అతడి స్వల్ప తొలి యత్నాలు ఘనమైన ముగింపును కోరాయి:
అతడి గతమంతా ఇప్పుడు  నవ్యంగా రూపొందాలి
ఆమె ఆనందాన్ని తనలో పోతపోసుకోవాలని,
ఆమె అందానికి, మహత్తుకు తన జీవనాలయంలో గుడికట్టాలని.
కాని ఇప్పుడు అతడి వ్యక్తి ఆత్మ కన్నా విశాలం అయ్యింది;
అతడి హృదయం లోని ఆకాంక్ష అమాంతంగా పెరిగిపోయింది:
ఏకాంత స్వేచ్ఛ అతడికి సంతృప్తి నీయలేకపోయింది,
భూమి కోసం, మనుషుల కోసం ఆమె తేజాన్ని, ఆనందాన్ని కోరుకున్నాడు.
కాని అజ్ఞానంతో, మృత్యువుతో కూడుకున్న భూమి పాశాన్ని తెంచేందుకు
మానవ శక్తి, మానవ ప్రేమ నిష్ప్రయోజకాలు;
అతడి ప్రకృతి యొక్క శక్తి ఓ పసికందు సత్తా వంటిది;
అల్లార్చే చేతులకి అందనంత ఎత్తులో వుంది స్వర్గం.
ప్రయత్నం వల్ల, ఆలోచన వల్ల దిగి వచ్చే కాంతి కాదిది;
మనస్సు యొక్క మౌనంలో పరమం పని చేస్తుంది
సద్దుమణిగిన హృదయం పలుకని పదాన్ని వింటుంది.
ఓ విశాల సమర్పణే అతడి  ఏకైక బలం.
ఎత్తులలో జీవించే ఓ శక్తి పని చెయ్యాలి,
జీవితపు మూసిన గదిలో అమర్త్యుడి గాలిని ప్రవేశపెట్టి
మితాన్ని అమితంతో పూరించాలి.
నిరాకరించే దానంతటినీ పెల్లగించాలి, హతమార్చాలి
ఏ అనన్యుడి కోసం అయితే మన జీవితాలు ఏర్పడ్డాయో
అతడి ప్రాప్తికి అడ్డుపడే మన పలు తపనలని అణగదొక్కాలి.
అతడిలోని ఇతర ఆశల ఆక్రందన లన్నీ సద్దుమణిగాయి:
తన హృదయంలోకి, మనస్సు లోకి, నిశ్వసించే దేహం లోకి
ఆమె సన్నిధిని, శక్తిని ఆకర్షించాలని మాత్రమే తపించాడు;
ఈ యాతనామయ ప్రపంచం యొక్క అంధకారం లోకి
ప్రేమ, సత్యం, ఆనందాల ఆమె మధుర స్పర్శ
దిగి వచ్చేలా చెయ్యాలని మాత్రమే పరితపించాడు.
అతడి ఆత్మ విడుదల పొంది, ఆమెకు మాత్రమే సమర్పించబడింది.

(End of the Canto Two – “Adoration of the Divine Mother”)