Sri Aurobindo and the Mother

Sri Aurobindo and the Mother

Monday, December 30, 2013

'సావిత్రి' మహాకావ్యం నుండి కొన్ని పంక్తులు




శ్రీ అరొబిందో వ్రాసిన మహాకావ్యం “సావిత్రి”.
దీన్ని గతంలో ఎంతో కవులు మంది తెలుగులోకి అనువదించారు. ఆ స్థాయిలో అనువదించడం అంత సులభం కాదు.
కాని సావిత్రి కావ్యన్ని చదువుకున్నా, అనువదించినా కలిగే ఆనందం చెప్పనలవి కాదు.
సావిత్రి  కావ్యంలో ‘Adoration of the Divine Mother’ అనే పర్వానికి/అధ్యాయనికి తెలుగు అనువాదం కొన్ని పోస్ట్ లలో పోస్ట్ చేద్దామని ఉద్దేశం…




From Sri Aurobindo’s ‘Savitri’. Canto II: “Adoration of the Divine Mother”
Even while he stood on being’s naked edge
And all the passion and seeking of his soul
Faced their extinction in some featureless Vast,
The Presence he yearned for suddenly drew close.
Across the silence of the ultimate Calm,
Out of a marvellous Transcendence’ core,
A body of wonder and translucency
As if a sweet mystic summary of her self
Escaping into the original Bliss
Had come enlarged out of eternity,
Someone came infinite and absolute.

A being of wisdom, power and delight,
Even as a mother draws her child to her arms,
Took to her breast Nature and world and soul.

Abolishing the signless emptiness,
Breaking the vacancy and voiceless hush,
Piercing the limitless Unknowable,
Into the liberty of the motionless depths
A beautiful and felicitous lustre stole.
The Power, the Light, the Bliss no word can speak
Imaged itself in a surprising beam
And built a golden passage to his heart
Touching through him all longing sentient things.
A moment’s sweetness of the All-Beautiful
Cancelled the vanity of the cosmic whirl.

A Nature throbbing with a Heart divine
Was felt in the unconscious universe;
It made the breath a happy mystery.
A love that bore the cross of pain with joy
Eudaemonised the sorrow of the world,
Made happy the weight of long unending Time,
The secret caught of God’s felicity.
Affirming in life a hidden ecstasy
It held the spirit to its miraculous course;
Carrying immortal values to the hours
It justified the labour of the suns.
For one was there supreme behind the God.
A Mother Might brooded upon the world;
A Consciousness revealed its marvellous front
Transcending all that is, denying none:
Imperishable above our fallen heads
He felt a rapturous and unstumbling Force.
The undying Truth appeared, the enduring Power
Of all that here is made and then destroyed,
The Mother of all godheads and all strengths
Who, mediatrix, binds earth to the Supreme.

(pp 312-313)


 జగజ్జనని ఆరాధన


ఉనికి చివరి అంచున అతడు నిలిచి వున్న తరుణంలో
అతడి ఆత్మలోని తపన, శోధన అంతా
ఏదో నిర్వికార బృహత్తులో లయం కాజొచ్చిన క్షణంలో,
అతడు పరితపించిన సన్నిధి ఉన్నట్లుండి సన్నిహితమయ్యింది.
చరమ నైశ్చ్యల్యపు నిశ్శబ్దానికి ఆవల,
బ్రహ్మాండమైన అతీతత్వపు సారం లోనుండి,
ఓ అద్భుత విరాజమాన దేహం,
ఆమె ఆత్మ యొక్క మధుర మహత్తర సారాంశంలా
ఏదో ప్రప్రథమ ఆనందంతో విలీనం అవుతూ
శాశ్వతత్వం నుండి పెల్లుబికి సాక్షాత్కరించింది,
అనంతమై, అనపేక్షమై ఎవరో దిగివచ్చారు.
ప్రజ్ఞ, ప్రాబల్యం, ప్రహ్లాదాలు మూర్తీభవించిన ఓ జీవి,
తల్లి తన బిడ్డని అక్కున జేర్చుకున్నట్లు,
ప్రకృతిని, ప్రపంచాన్ని, ఆత్మని తన ఒడి జేర్చుకుంది.
చిన్నెలు లేని శూన్యాన్ని రద్దు చేస్తూ,
రిక్తతని, నిస్వనమైన మౌనాన్ని భంగపరుస్తూ,
హద్దుల్లేని అజ్ఞేయాన్ని భేదిస్తూ,
చలన రహిత లోతుల్లోకి చొరబడింది
ఓ సుందర, సుఖమయ ప్రకాశం.
మాటకి అందని ఆ శక్తి, కాంతి, ఆనందం
ఓ ఆశ్చర్యకర కిరణరాశిగా పోతపోసుకుని
అతడి హృదయంలోకి ఓ బంగరు బాటను వేసి
అతడి ద్వారా ఆర్తిగొన్న జీవరాశి సమస్తాన్ని స్పృశించింది.
ఆ సర్వ సౌందర్యపు క్షణమాత్రపు  తీయదనం
విశ్వభ్రమణం యొక్క అర్థరాహిత్యాన్ని వమ్ముచేసింది.
అచేతన విశాల విశ్వంలో
దివ్య హృదయంతో స్పందించే ప్రకృతి అనుభవమయ్యింది;
దాని వల్ల ఊపిరి ఓ సంతోషకర రహస్యం అయ్యింది.
యాతనా శిలువని ఆనందంగా భరించే  ప్రేమ
లోకంలోని శోకాన్ని శ్రేయోపేతంగా మార్చి,
అంతులేని కాలభారాన్ని సుతోషితం గావించి,
భగవదానంద రహస్యాన్ని వశం చేసుకుంది.
జీవితంలో దాగిన ఓ గుప్త పారవశ్యాన్ని సమర్ధిస్తూ
ఆత్మని దాని మహత్తర మార్గంలో నిలిపింది;
అమర విలువలని ఘడియలలోకి చొప్పిస్తూ
విశ్వప్రయాసలకి సంజాయిషీ చెప్పింది.
దైవం వెనుక మరి ఓ పరమం వుంది.
ఓ మాతృశక్తి ప్రపంచాన్ని కనిపెట్టుకుని వుంది;
అన్నిటికీ అతీతమైనా, దేనినీ ఒల్లని
ఓ చైతన్యం దాని అద్భుత ముఖాన్ని వెల్లడి చేసింది:
మన పడిన శిరసులపై అక్షయమై వెలుగొందే
ఓ తీయని, తొట్రువడని శక్తిని గుర్తించాడు.
సృజింపబడి, నశింపబడే దానంతటిలో
సమసిపోక నిలిచే శక్తి, ఆ మృతిలేని స్ఫుట సత్యం,
సమస్త శక్తులకి, సురలకి తల్లి,
భూమిని పరమాత్మతో సంధించే మధ్యవర్తిని.

(ఇంకా వుంది)

Sunday, December 29, 2013

శరీరంపై ఆలోచనల ప్రభావం



There are people – as soon as the least thing happens to their body, their mind is completely upset. There are others still who may be very ill and yet keep their mind clear. It is rarer and more difficult to see a mind that’s upset and the body remaining healthy – it is not impossible but much rarer, for the body depends a great deal on the state of the mind. The mind is the master of the physical being. And I have said that the latter was a very docile obedient servant. Only one doesn’t know how to use one’s mind, rather the opposite. Not only does one not know how to use it, but one uses it ill – as badly as possible. The mind has considerable power of formation, and a direct action on the body, and usually one uses this power to make oneself ill. For as soon as the least thing goes wrong, the mind begins to shape and build all the catastrophes possible, to ask itself whether it could be this, whether it could be that, if it is going to be like that, and how it will all end. Well, if instead of letting the mind do this disastrous work, one uses the same capacity to make formations – simply, for example to give confidence to the body, to tell it that it is just a passing disturbance and that it is nothing, and if it enters a real state of receptivity, the disorder will disappear as easily as it has come, and one can cure oneself in a few seconds – if one knows how to do that, one gets wonderful results.
                                                                                    - The Mother

కొందరు ఉంటారు… వారి శరీరానికి ఏ చిన్నది జరిగినా వాళ్ల మనస్సంతా కల్లోలమయం అయిపోతుంది.  మరి కొందరు ఉంటారు… ఒంట్లో ఎంత అస్వస్థతగా వున్నా మనస్సు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు అలజడిగా వుంటూ శరీరం ఆరోగ్యంగా ఉండడం అనేది అసంభవం కాదు గాని కాస్త అరుదుగా కనిపిస్తుంది. ఎందుకంటే శరీరం యొక్క స్థితి మనస్సు యొక్క స్థితి మీద ఆధారపడుతుంది. శరీరానికి మనసు యజమాని. శరీరం ఓ విధేయమైన, వినమ్రమైన బంటు అని అంతముందు ఓ సారి చెప్పాను. అయితే సామాన్యంగా మనసుని ఎలా వాడుకోవాలో మనుషులకి తెలియదు. ఎలా వాడాలో తెలియకపోవడమే దాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. వీలైనంత తప్పుగా వాడుతారు. మనస్సుకి గణనీయమైన  క్రియాత్మకశక్తి ఉంటుంది. శరీరం మీద సూటిగా పని చేసే సామర్థ్యం ఉంటుంది. సాధారణంగా మనుషులు ఈ శక్తిని ఉపయోగించుకుని అనారోగ్యం పాలవుతారు. ఏ చిన్న పొరబాటు జరిగినా మనస్సు దాన్ని చిలవలు పలవలు చేసి నానా రకాల ఉపద్రవాలని ఊహించుకుంటుంది. ఇలా జరుగుతుందేమో, మరి అలా జరుగుతుందా, ఇక చివరికి ఏమౌతుందో?  ఈ రకంగా మనసుని వినాశక పద్ధతిలో పరుగులు పెట్టనీకుండా, అదే క్రియాత్మక శక్తిని శరీరంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా వాడుకుంటాం. ఇదంతా ఎంతో కాలం ఉండదని, మరేం  ఫరవాలేదని నచ్చెచెబుతాం. శరీరం దీనికి స్పందిస్తే వచ్చిన సమస్య వచ్చినంత వేగంగానే మాయమైపోతుంది. క్షణాలలో మళ్లీ స్వస్థత చేకూరుతుంది. ఇది ఎలా చెయ్యాలో తెలుసుకుంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు.
-      శ్రీ మాత

Friday, December 27, 2013

వైదిక సిద్ధాంతం - సింహావలోకనం (2)



వైదిక చింతనలోని మారని సారంతో పాటు అందులోని లోతు, సునిశితత్వం, శిల్పసౌందర్యాలని జోడించి పరిగణిస్తే కొంత ఆసక్తికరమైన చర్చకి అవకాశం ఏర్పడుతుంది.  అంత సుస్థిరమైన శిల్పం, సారం ఒక జాతి యొక్క చింతనా చరిత్ర యొక్క, అనుభవైక చరిత్ర యొక్క తొలిదశలలో సాధ్యం కాదని సులభంగా వాదించడానికి వీలవుతుంది. కనుక మనకి తెలిసిన వేద సంహిత ఒక ప్రత్యేక కాలం యొక్క ఆరంభాన్నో, వికాస క్రమంలోని మధ్యంతర స్థితులనో, కాకుండా అంతిమ స్థితిని సూచిస్తోందని అనుకోవలసి వస్తుంది. వేదంలో మనం అత్యంత ప్రాచీనం అని తలపోసే ఋక్కులు కూడా, ఒక విధంగా కొంచెం అర్వాచీన పరిణామానికి చిహ్నాలు కావచ్చు. మరింత పూర్వపు మానవ భాషలో వ్యక్తం చెయ్యబడ్డ ప్రాచీన దివ్యగీతికలని, కాస్త అర్వాచీనమైన, నమ్యమైన శిల్పంలో పోతపోయగా పుట్టిన రచనలు కావచ్చు (*). లేదా అసలు వేదసాహిత్యం సమస్తమూ, ఏదో ప్రాచీన ఆర్య కవితా రాశి నుండి వేద వ్యాసుడు ఎంచుకున్న కొన్ని ప్రత్యేక గీతాల సముదాయమే  కావచ్చు. మరి అపారమైన వ్యాస సంకలనం చేశాడు కనుకనే వ్యాసుడికి ఆ పేరు వచ్చింది. ఆసన్నమవుతున్న కలియుగం దిశగా, చిక్కనవుతున్న సంజె కాంతికి, చరమాంధకారానికి నెలవయిన రాబోయే శతబ్దాల దిశగా, దృష్టి సారించిన కృష్ణ ద్వైపాయన వ్యాసుడి యొక్క సృష్టి వేదం. ప్రజ్ఞానమయ యుగాలకి, విరాజమాన ఉషస్సులకి చెందిన మన ‘పితరులు’ తమ వారసులకి అందించిన ఆఖరి వీలునామా వేదం. అధోతలాల దిశగా, భౌతిక జీవనం దిశగా, బుద్ధి గత, తార్కిక, హేతు నిబద్ధమైన జీవనం దిశగా ఉన్ముఖులైన మానవాళికి వారు అందించిన చరమ సందేశం వేదం.

(*వేదంలో “ప్రాచీన” మరియు “ఆధునిక” ఋషుల ప్రస్తావన వస్తుంటుంది. ఆ ప్రాచీన ఋషులని ఇంచుమించుగా దేవతామూర్తులుగాను, జ్ఞానానికి మూలకర్తలుగాను పరిగణించవచ్చునేమో.)

అయితే ఇవన్నీ నిరాధారిత ఊహాగానాలే, అనుమానం చేత గ్రహించే విషయాలే. మానవ యుగ చక్రంలో గతానికి చెందిన భావ జాలం మరుగుపడడం, వినష్టం కావడం తరచు కనిపిస్తుంటుంది. వేదం విషయంలో అదే జరిగినట్టుంది. వేదం తరువాత భారతీయ అధ్యాత్మిక చరిత్రలో మహర్దశగా చెప్పుకోదగ్గ వేదాంత యుగారంభానికే వేద చింతన బాగా మరుగుపడిపోయింది. ప్రాచీన వైదిక జ్ఞానం నుండి వీలైనంత భాగాన్ని సంరక్షించి దానికి కొత్త ఊపిరి పోయడానికి ప్రయత్నించింది వేదాంతం. ఒక విధంగా ఈ పరిణామం అనివార్యమే ననిపిస్తుంది. ఎందుకంటే వేద ఋషులు సంస్థాపించిన చింతనా వ్యవస్థ సాధారణ మానవాళికి అందరాని అనుభవాల మీద ఆధారపడినది. ఆ శోధనలో వారికి ఉపయోగపడ్డ చేతనా సామర్థ్యాలు సామాన్యులలో ప్రచ్ఛన్నంగా ఉంటాయి.  లేక అసంపూర్ణంగా వికాసం చెంది ఉంటాయి. ఆ సామర్థ్యాలు కొందరిలో మేలుకొని వున్నా, వాటిలో ఎన్నో అనుచిత అంశాల మేళవం కనిపిస్తుంది. సత్యాన్వేషణలో ఆరంభంలో ఉండే శోధనా తీవ్రత నెమ్మదించాక, వేసటతో కూడుకున్న దశలు రావచ్చు. అలాంటి దశలలో పాత సత్యాలు పాక్షికంగానైనా వినష్టం కావచ్చు. అలా వినష్టమైన భావసారాన్ని ఆ ప్రాచీన గీతాల పునఃపరిశీలన ద్వారా తిరిగి సాధించడం అంత సులభం కాదు. ఎందుకంటే వేదఋక్కులు ఉద్దేశపూర్వకంగా ద్వంద్వార్థాన్ని సూచించే భాషలో కూర్చబడ్డాయి.

ఒకసారి మూలరహస్యం తెలిస్తే మనకి అర్థం కాని భాష కూడా అర్థమయ్యే అవకాశం వుంటుంది. కాని ఉద్దేశపూర్వకంగా ద్వంద్వార్థంతో చేసిన రచన లోని అంతరార్థాన్ని వెలికి తీయడం మరింత కష్టం. ఎందుకంటే అందులో శోధనని తప్పుదోవ పట్టించే ఎరలు ఎన్నో ఉంటాయి. కనుక భారతీయ మానసం మరలా వేదంలోని అంతరార్థాన్ని తెలుసుకోగోరే ప్రయత్నం చేసినప్పుడు ఆ కర్యం కఠినంగా తోచింది, పాక్షిక విజయమే లభించింది. ఈ రహస్యాన్ని ఛేదించగల ఒక్క మూలం మాత్రమే ఇంక మిగిలింది. వేదమంత్రాలని జ్ఞాపకం పెట్టుకుని పారంపర్యంగా ప్రచారం చేసే వాళ్లు, లేదా వైదిక కర్మకాండకి అధ్వర్యం వహించే వాళ్లు, మనకి అందించే ఆ ప్రాచీన, సాంప్రదాయక జ్ఞానం. అసలు వేదమంత్రాల బోధన, కర్మకాండ నిర్వహణ – ఈ రెండు కార్యాలు మొదట్లో ఏకమై వుండేవి. తొలిరోజుల్లో యజ్ఞం చేసే యాజ్ఞికుడే వేదగురువు కూడా అయ్యేవాడు. కాని వేదంలోని తేజం, సారం అప్పటికే మరుగుపడిపోయాయి. వైదిక కర్మకాండ జరిపించే మేటి పురోహితులకి కూడా ఆ మంత్రాలలోని శక్తి గురించి, వాటి అంతరార్థం గురించి అపరిపూర్ణమైన అవగాహన మాత్రమే వుండేది. ఎందుకంటే వైదిక కర్మకాండలోని బాహ్యాచారం అందులోని ఆంతరిక జ్ఞానం మీద ఓ దట్టమైన బెరడులా పేరుకుపోయింది. ఏ ఆంతరిక సారానికి అది రక్షక కవచంగా మొదట్లో ఏర్పాటు చెయ్యబడిందో ఆ ఆంతరిక సారానికి కారాగారంలా పరిణమించింది. ప్రతీకాత్మకంగా జరిపించే కర్మకాండలోని శక్తి క్రమంగా హరించుకుపోసాగింది. ఆ ప్రాచీన పునీత గీతంలోని తేజం తొలగిపోయింది. కరుకైన, అయోమయమైన ఉపరివిషయం మాత్రమే మనకి మిగిలింది.

(ఇంకా వుంది)




Wednesday, December 25, 2013

‘Mother of God ’ (దేవమాత) - శ్రీ అరొబిందో



‘Mother of God ’ – by Sri Aurobindo

A conscious and eternal Power is here
Behind unhappiness and mortal birth
And the error of Thought and blundering trudge of Time.
The Mother of God, his sister and his spouse,
Daughter of his wisdom, of his might the mate,
She has leapt from the Transcendent's secret breast
To build her rainbow worlds of mind and life.
Between the superconscient absolute Light
And the Inconscient's vast unthinking toil
In the rolling and routine of Matter's sleep
And the somnambulist motion of the stars
She forces on the cold unwilling Void
Her adventure of life, the passionate dreams of her lust.
Amid the work of darker Powers she is here
To heal the evils and mistakes of Space
And change the tragedy of the ignorant world
Into a Divine Comedy of joy
And the laughter and the rapture of God's bliss.
The Mother of God is master of our souls;
We are the partners of his birth in Time,
Inheritors we share his eternity.


దేవ మాత

 
శోక నిలయంలో, మర్త్య  జీవనపు ముసుగులో
ఆలోచన తడబడు నడకలో,  కాలపు భార గమనంలో
సచేతన, సనాతన శక్తి వెలసింది.
ఆమె దేవమాత, దేవ సహోదరి, సహధర్మిణి,
అతడి ప్రతిభకు పుత్రిక, అతడి శక్తికి సమవుజ్జీ.
మనో ప్రాణాల హరివింటి సీమలను ఇంపుగా మలచాలని
పరమాత్మ రహస్య లోతుల నుండి పెల్లుబికిందామె.

అతిచేతనలోని ప్రచండ, పరమ తేజానికి
అచిత్తిలోని విశాల, నిస్సార చలనానికి మధ్య,
పదార్థపు నిష్పల సుషుప్తిలో
తారల నిద్రాగమనంలో
మరణతుల్య శీతల శూన్యంలో
తన జీవనార్తిని పూరిస్తుంది, తన తపనల రవ్వలు రగిలిస్తుంది.
చీకటి శక్తుల చర్యల  నేపథ్యంలో అరుదెంచిందామె,
రూపసృష్టిలోని విరూపాలని సరిదిద్దాలని
అజ్ఞానమయ లోకపు దైన్యం తొలగించాలని
పరమాత్ముడి పసినవ్వులని, భగవంతుడి హ్లాదాన్ని ఇల వెలిగించాలని.
దేవమాత మన ఆత్మలకి నేత.
కాలంలో, లోకంలో ఆయన జననానికి భాగస్వాములం
ఆయన సనాతనత్వానికి సంపూర్ణ వారసులం.